రేవంత్‌ సర్కార్‌కు కేటీఆర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ | KTR Serious Comments Over Telangana Congress Govt | Sakshi
Sakshi News home page

రేవంత్‌ సర్కార్‌కు కేటీఆర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Jan 4 2024 8:18 AM | Updated on Jan 4 2024 8:57 AM

KTR Serious Comments Over Telangana Congress Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అబద్ధాలను అస్త్రంగా మార్చుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వంద రోజుల్లో హామీలను నెరవేర్చకుంటే ప్రజలను చైతన్యవంతులను చేసి ఆ ప్రభుత్వాన్ని బొంద పెడతాం అని వార్నింగ్‌ ఇచ్చారు. 

కాగా, కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ వాటిని ఎగవేసేందుకు చేస్తున్న సిల్లీ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ విజయాలను వైఫల్యాలుగా చూపేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. అబద్ధాలను అస్త్రంగా మార్చుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వంద రోజుల్లో హామీలను నెరవేర్చకుంటే ప్రజలను చైతన్యవంతులను చేసి ఆ ప్రభుత్వాన్ని బొంద పెడతాం. రాబోయే రోజుల్లో మండల, నియోజకవర్గ స్థాయిలోనూ సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని రకాల ఎన్నికలకు కేడర్‌ను సన్నద్ధం చేస్తాం. కేడర్‌కు అండగా ఉంటూ కాంగ్రెస్‌ దుర్మార్గాలను ప్రజాస్వామికంగా ఎండగడతాం’.

అధికారం కోసం 
అలవికాని హామీలిచ్చి
తెలంగాణ ప్రజలను ఏమార్చి
అధికారంలోకి వచ్చిన వెంటనే మాటమార్చి
ఒక్కో హామీని తుంగలో తొక్కుతున్నది కాంగ్రెస్.

కొత్తగా ఇచ్చేవి దేవుడెరుగు..
ఉన్న పథకాలనే ఊడగొడుతున్నది..
ఈ కాంగ్రెస్ సర్కార్..!

ప్రజలను లైన్లలో నిలబెట్టి..
ప్రతి రోజు గోస పెడుతున్నది.. 
ఈ కాంగ్రెస్ సర్కార్..!!

అందుకే... 
ఇచ్చిన 420 హామీల అమలుకోసం
తెలంగాణ ప్రజల తరఫున.. 
ఒక గొంతుకగా
నిలబడి ప్రశ్నిస్తాం..!
కాంగ్రెస్ ను నిలదీస్తాం..!!
ప్రజల పక్షాన ప్రతినిత్యం పోరాడుతాం..!!! అని కామెంట్స్‌ చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement