Komatireddy Rajagopal Reddy Meets With Ponguleti Srinivasa Reddy - Sakshi
Sakshi News home page

పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి భేటీ.. హాట్‌ టాపిక్‌గా మారిన వీరి కలయిక!

Jul 4 2023 5:23 PM | Updated on Jul 4 2023 6:36 PM

Komatireddy Rajagopal Reddy Meets Ponguleti Srinivasa Reddy - Sakshi

సాక్షి,  హైదరాబాద్‌: ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డితో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం ఈ ఇద్దరూ నేతలు కలుసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. కాంగ్రెస్‌లో తిరిగి చేరడంపై పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డికి ఘర్‌ వాపసిపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆహ్వానం పలికారు. 

కాగా, గతేడాది ఆగస్టులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పి.. బీజేపీలో చేరారు. ఆ సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అవలంభిస్తున్న తీరును తప్పుబట్టారు. తెలంగాణలో ప్రతిపక్షం బలంగా లేదని.. అధికార టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ పార్టీ సరిగా పోరాటం చేయడం లేదని, జాతీయ నాయకత్వం బలహీనపడడం వల్ల కాంగ్రెస్‌లో ఉండి ఏమీ చేయలేకపోయానని, కాంగ్రెస్‌ను బాధతోనే వీడుతున్నట్లు ఆయన ఆవేదనగా చెప్పుకొచ్చారు.  ఇక నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం దూసుకుపోతుందని కూడా వ్యాఖ్యానించారు. 

అయితే తాజాగా పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశమైంది. బీజేపీ సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా కిషన్‌రెడ్డిని నియమించారు. అదే సమయంలో పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

చదవండి: బీజేపీలో కిషన్‌రెడ్డి బలం అదే.. ఆయనే ఇక తెలంగాణలో పార్టీ గేమ్‌ఛేంజర్‌!

బీజేపీ స్ట్రాటజీ.. తెలుగు రాష్ట్రాల బీజేపీ చీఫ్‌ల మార్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement