Delhi Liquor Scam: Komatireddy Rajagopal Reddy Counter To MLC Kavitha Tweet - Sakshi
Sakshi News home page

నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ.. కవిత ట్వీట్‌కు రాజగోపాల్‌ రెడ్డి రియాక్షన్‌

Dec 21 2022 4:24 PM | Updated on Dec 21 2022 4:55 PM

Komatireddy Rajagopal Reddy Counter To MLC Kavitha Tweet - Sakshi

నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం.

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవితకు మధ్య ట్విట్టర్‌లో మాటల వార్‌ కొనసాగుతోంది. కవిత ట్వీట్‌కు రాజగోపాల్‌రెడ్డి గట్టి కౌంటరే ఇచ్చారు. ‘‘రాజగోపాల్ అన్న.. తొందర పడకు.. మాట జారకు!!. 28 వేల సార్లు నా పేరు చెప్పినా అబద్ధం నిజం కాదు’’ అంటూ కవిత ట్వీట్‌​ చేశారు.

ఆమె ట్వీట్‌కు రియాక్షన్‌గా ‘‘నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం. నిన్ను మీ అన్న మీ నాయనా ఎవ్వరు  కాపాడలేరు. మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇంకా మీ తెరాస నాయకులు పారదర్శకరంగా టెండర్ ద్వారా వచ్చిన 18000 కోట్ల కోల్ బ్లాక్ టెండర్ విషయంలో నా పై విష ప్రచారం చేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకు రాబోయే రోజుల్లో అవినీతి మయమైన మీ కుటుంబం అంతా జైలుకెళ్లడం ఖాయం’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి బదులిచ్చారు.


చదవండి: ‘రాజగోపాల్ అన్న .. తొందర పడకు.. మాట జారకు..’ కవిత కౌంటర్‌


 

Advertisement
 
Advertisement
Advertisement