సోనియమ్మకు థాంక్స్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

Khammam Wyra MLA Ramulu Naik Thanks To KCR And Sonia Gandhi - Sakshi

వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ 

కేసీఆర్‌ లాంటి సీఎం లేరని వ్యాఖ్య 

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘‘పార్టీలకతీతంగా ఈ రోజు సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి (రూ.1,16,000) చెక్కులు పంపారు. ఎస్‌.. నేను సీఎంగా ఉన్నా.. మీ సాదకబాధకాల్లో ఉంటానని చెక్కులు పంపించారు. కేసీఆర్‌ తన, మన తేడా లేకుండా అందరి గురించి ఆలోచన చేసే సందర్భంగా అన్ని పార్టీలు కూడా ఆయన్ను ఆశీర్వదిస్తున్నాయి. రెండోసారి ముఖ్యమంత్రిని చేశాయి. మూడోసారి కూడా ముచ్చటగా ముఖ్యమంత్రి అవుతారనడంలో అతిశయోక్తిలేదు. ఇంత ఆలోచన చేశాక.. కేసీఆర్‌ గురించి మీరు కూడా ఆలోచించాలిగా.. ఎవరైనా, ఏ భావజాలంవారైన కావచ్చు’’ అని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ వ్యాఖ్యానించారు.

‘‘నక్సల్స్‌ అయినా కావచ్చు.. ఎన్టీ రామారావు ఏమన్నారు.. నక్సల్స్‌ కూడా దేశభక్తులే అన్నారు.. ఆయనకు నమస్కారం చేయాలి. ఎస్‌.. అది కరెక్ట్‌ భావజాలం. ఎక్కడైనా అభివృద్ధికి సపోర్ట్‌ చేయాల్సిందే. అమ్మ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ఆమెకు థాంక్స్‌ చెప్పాలి’’ అన్నారు రాములునాయక్‌. మంగళవారం ఖమ్మం జిల్లాలోని బొక్కలతండాలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. గతంలోనూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే.  

చదవండి: 'ఓటు వేస్తే డబ్బులు ఇస్తాం..భయపడాల్సిందేమీ లేదు'‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top