‘ఆప్‌’ స్టార్‌ క్యాంపెయినర్‌ల లిస్టులో కేజ్రీవాల్‌ పేరు | Kejriwal Name In The Aap Star Campaigners List | Sakshi
Sakshi News home page

‘ఆప్‌’ స్టార్‌ క్యాంపెయినర్‌ల లిస్టులో కేజ్రీవాల్‌ పేరు

May 4 2024 8:23 PM | Updated on May 4 2024 9:46 PM

Kejriwal Name In The Aap Star Campaigners List

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ఆమ్‌ఆద్మీపార్టీ శనివారం(మే4)విడుదల చేసింది. ఈ లిస్టులో 40 మంది స్టార్‌ క్యాంపెయినర్ల  పేర్లను చేర్చింది.

ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్‌ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా జైలులో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, మాజీ మంత్రి సత్యేందర్‌జైన్‌ పేర్లను లిస్టులో చేర్చడం గమనార్హం. 

వీరితో పాటు కేజ్రీవాల్‌ భార్య సునీత కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ సింగ్‌ ఎంపీలు రాఘవ్‌చద్దా, సందీప్‌పాఠక్‌ ఢిల్లీ  మంత్రులు, అతిశీ, సౌరభ్‌ భరద్వాజ్‌, గోపాల్‌రాయ్‌ తదితరులను స్టార్‌ క్యాంపెయినర్లుగా ఆప్‌ ప్రకటించింది.  

Advertisement
 
Advertisement
Advertisement