చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌పై మంత్రి కారుమూరి ఫైర్‌ | Karumuri Nageswara Rao Serious On Chandrababu Pawan And Lokesh | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఓ ముసలి నక్క.. పవన్‌పై కారుమూరి సీరియస్‌

Aug 10 2023 2:41 PM | Updated on Aug 10 2023 4:04 PM

Karumuri Nageswara Rao Serious On Chandrababu Pawan And Lokesh - Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌పై మంత్రి కారుమూరి నాగేశ్వర రావు సీరియస్‌ అయ్యారు. చంద్రబాబు ఓ ముసలి నక్క, దుర్మార్గుడు, పుంగనూరులో రౌడీలా వ్యవహరించారని ఆరోపించారు. లోకేశ్‌ పప్పు.. అతనొక రాజకీయ నాయకుడేనా? అని ప్రశ్నించారు. పవన్‌ తాటతీస్తా.. పంచలూడదీస్తా అంటున్నాడు.. ఇది కరెక్టేనా? అని అన్నారు. 

సినిమాలకు రాజకీయాలను జోడించడమేంటి..
కాగా, మంత్రి కారుమూరి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పుంగనూరులో పోలీసులకు చేతులెత్తి దండం పెట్టాలి. రక్తమోడుతున్నా తుపాకులకు పనిచెప్పకుండా సంయమనం పాటించారు. చంద్రబాబు ఇంకెంతమంది ఉసురు పోసుకుంటారని విమర్శించారు. ఏపీలో శాంతి భద్రతలు లేవని చూపించడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. పవన్‌ తాటతీస్తా.. పంచలూడదీస్తా అంటున్నాడు.. ఇది కరెక్టేనా? అని అన్నారు. మనస్థాయి ఏంటి.. మన బ్రతుకేంటి అని ఆలోచించుకోవాలి. సినిమాను సినిమాగా.. రాజకీయాలను రాజకీయాలుగా చూడాలి. అంతేకానీ సినిమాకు, రాజకీయాలను జోడించి చూడటం సరికాదు. 

ప్రజల వద్దకు వెళ్లి ఏం చెబుతారు.. 
మమ్మల్ని విమర్శించే ఏ పార్టీ నాయకులకైనా ప్రజల వద్దకు వెళ్లే దమ్ముందా? అని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన, బీజేపీలో నేతలు తప్ప ఏ ఒక్క కార్యకర్త అయినా మాట్లాడుతున్నాడా?.  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్ని పార్టీల వారికీ పథకాలు అందుతున్నాయి. అందుకే నాయకులు తప్ప ఆ పార్టీల కార్యకర్తలెవరూ మమ్మల్ని విమర్శించడం లేదు. వీరంతా ఏం చేశారని ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడతారు. సర్వేలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి. వాళ్లు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పలేకపోతున్నారు. టీడీపీ కార్యకర్తల ఉసురు, ప్రజల ఉసురు కచ్చితంగా చంద్రబాబుకు తగులుతుంది. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికే అందరినీ కలుపుకుని అధికారంలోకి రావాలని చూస్తున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: రాజకీయాల్లో టీడీపీ హింసను ప్రేరేపిస్తుంది: కొమ్మినేని

Advertisement
 
Advertisement
Advertisement