నారా లోకేశ్‌పై మంత్రి కారుమూరి సెటైర్లు | Karumuri Nageswara Rao Satirical Comments On Nara Lokesh | Sakshi
Sakshi News home page

నారా లోకేశ్‌పై మంత్రి కారుమూరి సెటైర్లు

Aug 29 2023 3:22 PM | Updated on Aug 29 2023 3:36 PM

Karumuri Nageswara Rao Satirical Comments On Nara Lokesh - Sakshi

సాక్షి, రాజమండ్రి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పొలిటికల్‌ సెటైర్లు వేశారు. చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా సాధించిందేమీ లేదన్నారు. చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు. 

కాగా, మంత్రి కారుమూరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొంగ ఓట్లను సృష్టించింది చంద్రబాబు. గత ప్రభుత్వంలో పందికొక్కుల్లా ఇసుకను తిన్నది టీడీపీ నేతలే. చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. దేశంలోనే జీడీపీలో మన రాష్ట్రం నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. టీడీపీ కార్యకర్తలను కేసులు పెట్టించుకోమనడం లోకేశ్‌ తెలివికి నిదర్శనం అని సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. 

పౌరసరఫరాల శాఖలో అవినీతి లేకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నాం. పెట్రోల్ బంకుల్లో కల్తీలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. పెట్రోల్‌ కల్తీ చేస్తున్న బంకులను సీజ్‌ చేశాం. కొన్ని బంగారు షాపులో కూడా తనిఖీలు నిర్వహించాం. ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు నిర్వహించి 131 కేసులు నమోదు చేశాం. ప్రజలకు నష్టం జరగకూడదనే ప్రధాన ఉద్దేశంతో ఈ దాడులు కొనసాగిస్తున్నాం. వంట నూనెల్లో కూడా కల్తీ, లోటు పాట్లు లేకుండా చర్యలు చేపట్టాం. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తంగా 1,126 కేసులు నమోదు చేశాం. రేషన్ బియ్యంలో విటమిన్లతో కూడిన పోషకాలను కలుపుతున్నాం అని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: ‘చంద్రబాబును.. పురంధేశ్వరి ఎందుకు నిలదీయలేదు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement