గృహలక్ష్మి పథకం ప్రారంభం.. కుటుంబంలో మహిళా పెద్దకు రూ.2000

Karnataka Congress Launches Costliest Scheme On 100 Days In Power - Sakshi

బెంగళూరు: ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం గృహ లక్ష్మి పథకంతో ఘణంగా వేడుకను జరుపుకుంది. ఈ పథకంలో ప్రతి ఇంట‍్లో ఒక మహిళా పెద్దకు రూ.2000 అందించనున్నారు. ఈ కార్యక్రమం సీఎం సిద్ధరామయ్య స్వస్థలం మైసూర్‌లో జరిగింది. కేంద్రం నుంచి సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, మళ్లికార్జున ఖర్గే హాజరయ్యారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి మహిళలు కూడా కార్యక్రమానికి వచ్చారు.

నేడు 50 శాతం మందికి అందాల్సిన రూ.1.08 కోట్ల లబ్దిదారులకు అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయని తెలిపారు. మిగిలిన లబ్దిదారుల అకౌంట్లలో రేపు జమ అవుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమానికి హాజరైన పలువురు మహిళలు.. తమ అకౌంట్లలో డబ్బులు పడ్డాయని సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇకపై తన పిల్లల స్కూల్ ఫీజులు సులభంగా చెల్లించవచ్చని అన్నారు.

ఫెరిఫికేషన్‌పై అభ్యంతరాలు..
జీఎస్టీ రిటర్న్‌లు ఫైల్ చేయని కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. అయితే.. ఈ పథకం అమలు తీరుపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల ఆధారంగా వారి జీఎస్టీ వివరాలు సేకరిస్తామని కర్ణాటక మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి లక్ష్మి హెబ్బాల్కర్ తెలిపారు. కుటుంబ సాఫ్ట్‌వేర్ ఆధారంగా వివరాలు భద్రపరుస్తామని పేర్కొన్నారు. అయితే.. డేటా భద్రతపై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఒకే ఇంటి నుంచి ఇద్దరు మహిళలకు స్కీం వర్తించకుండా జాగ్రత్తలు పాటించామని మంత్రి తెలిపారు. కానీ మరణించినవారి పేరుపై ఉన్న రేషన్ కార్డుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. త్వరలో ఈ వివరాలు మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: అమితాబచ్చన్‌కి రాఖీ కట్టిన సీఎం మమతా బెనర్జీ..

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top