సోమిరెడ్డి అక్రమాలపై విచారించండి | Kakani Govardhan Reddy Fires On Somireddy Chandra Mohan Reddy | Sakshi
Sakshi News home page

సోమిరెడ్డి అక్రమాలపై విచారించండి

Aug 27 2024 5:43 AM | Updated on Aug 27 2024 5:43 AM

Kakani Govardhan Reddy Fires On Somireddy Chandra Mohan Reddy

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు (బారకాసు): సర్వేపల్లి ఎమ్మెల్యే సోమి­రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అవినీతి, ఆక్రమాలపై సీఎం చంద్రబాబు విచారణ జరిపించాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమిరెడ్డి అవినీతి, అక్రమాలు రోజురోజుకూ మి­తిమీరిపోతున్నాయని ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమ వారం మీడియాతో మాట్లాడుతూ.. వంద రోజుల్లో సోమిరెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై తాను త్వరలోనే నివేదిక విడుదల చేస్తానని చెప్పారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు రూ.3 లక్షలు ఇవ్వాలని సోమిరెడ్డి డిమాం­డ్‌ చేశారని బీజేపీ వెంకటాచల మండల ప్రధాన కార్యదర్శి పిల్లిపోకుల పెంచలయ్య ఇటీ­వల వెల్లడించారని గుర్తు చేశారు.

ఆ విషయాల­తో కాని, అతనితో కాని త­నM­ý ు ఎటువంటి సంబంధం లేదన్నారు. కానీ.. ఆయన­తో తానే మాట్లాడించినట్టు సోమి­రెడ్డి చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశి్నంచారు. ‘అధికారం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి పెంచలయ్య మాతో మాట్లాడినట్లుగా నిరూపించాలి. అందుకోసం విచారణ కూడా చేయించుకోవాలి’ అని కాకాణి సూచించారు.  తనపై కేసులు పెడితే భయపడేది లేదని, పోలీసులు, కేసులు, జైళ్లకు తాము భయపడేవాళ్లం కాదని అన్నారు.  పోస్టులు అమ్మకునే బుద్ధి ఆయనకు గతంలోనే ఉందన్నారు. మంత్రిగా ఉన్నప్పుడే షిఫ్ట్‌ ఆపరేటర్ల పోస్టులు, వీఓఏ పోస్టులు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులు, రేషన్‌ డీలర్‌ పోస్టులు అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement