శవ రాజకీయాలు చేస్తున్న బాబు, లోకేష్‌ | Jogi Ramesh Fires On Chandrababu Nara Lokesh | Sakshi
Sakshi News home page

శవ రాజకీయాలు చేస్తున్న బాబు, లోకేష్‌

Jun 6 2022 5:15 AM | Updated on Jun 6 2022 5:16 AM

Jogi Ramesh Fires On Chandrababu Nara Lokesh - Sakshi

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): చంద్రబాబు, లోకేష్‌ శవ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. ఆదివారం ఆయన ఏలూరులో విలేకరులతో మాట్లాడారు. చింతమనేని తనకు ప్రాణహాని ఉందని పేర్కొనడం హాస్యాస్పదం అని చెప్పారు.

హత్యా రాజకీయాలకు తెరలేపిందే టీడీపీ నాయకులని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవులు ఇచ్చి, సామాజిక న్యాయం చేసిన దమ్మున్న నాయకుడు ఒక్క జగన్‌మోహన్‌రెడ్డేనని చెప్పారు.

ఇటీవల నిర్వహించిన మహానాడులో గానీ, ఇతర ఏ సందర్భంలో గానీ.. చంద్రబాబు బీసీలకు తన పార్టీలో సముచిత స్థానం ఇస్తానని చెప్పలేకపోయారన్నారు. జగన్‌ ఇచ్చిన 17 మంది కంటే ఎక్కువ మంత్రి పదవులు ఆ వర్గాలకు ఇస్తానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని సవాలు విసిరారు.

ఇక దత్తపుత్రునికి రాజకీయ నాయకుని లక్షణాలే లేవని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీని ఓడించడానికి ఎవరితో పొత్తు పెట్టుకోవాలో కూడా తెలియని స్థితిలో జనసేనాని ఉన్నాడన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement