breaking news
jogi ramesh protest
-
శవ రాజకీయాలు చేస్తున్న బాబు, లోకేష్
ఏలూరు (ఆర్ఆర్పేట): చంద్రబాబు, లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఆదివారం ఆయన ఏలూరులో విలేకరులతో మాట్లాడారు. చింతమనేని తనకు ప్రాణహాని ఉందని పేర్కొనడం హాస్యాస్పదం అని చెప్పారు. హత్యా రాజకీయాలకు తెరలేపిందే టీడీపీ నాయకులని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవులు ఇచ్చి, సామాజిక న్యాయం చేసిన దమ్మున్న నాయకుడు ఒక్క జగన్మోహన్రెడ్డేనని చెప్పారు. ఇటీవల నిర్వహించిన మహానాడులో గానీ, ఇతర ఏ సందర్భంలో గానీ.. చంద్రబాబు బీసీలకు తన పార్టీలో సముచిత స్థానం ఇస్తానని చెప్పలేకపోయారన్నారు. జగన్ ఇచ్చిన 17 మంది కంటే ఎక్కువ మంత్రి పదవులు ఆ వర్గాలకు ఇస్తానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని సవాలు విసిరారు. ఇక దత్తపుత్రునికి రాజకీయ నాయకుని లక్షణాలే లేవని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీని ఓడించడానికి ఎవరితో పొత్తు పెట్టుకోవాలో కూడా తెలియని స్థితిలో జనసేనాని ఉన్నాడన్నారు. -
చంద్రబాబు ఇంటి వద్ద బైఠాయించిన ఎమ్మెల్యే జోగి రమేష్
-
చంద్రబాబు ఇంటిముట్టడికి వైఎస్సార్సీపీ యత్నం
-
వైఎస్ఆర్సీపీ నేతలపై పోలీసుల దౌర్జన్యం
విజయవాడ: కృష్ణా జిల్లా జి. కొండూరు మండలంలో వైఎస్ఆర్సీపీ నేతలకు పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి. మట్టి వివాదంలో పామర్తి సాంబశివరావు, వంశీ అనే వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసులు నమోదు చేయకుండా పలు పోలీస్స్టేషన్లకు తిప్పుతున్నారు. మంత్రి దేవినేని ఉమ ఆదేశాలతోనే పోలీసులు అత్యుత్సాహం చూపుతూ వైఎస్సార్సీపీ నేతలను కావాలని వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు. పోలీసుల దాష్టీకానికి నిరసనగా ఆయన జి.కొండూరు పోలీసు స్టేషన్ ఎదుట సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. వైఎస్సార్సీపీ నేతలను తక్షణం విడుదల చేయాలని, అంతవరకూ ఆందోళన ఆగదని ఆయన హెచ్చరించారు.