వైఎస్‌ఆర్సీపీ నేతలపై పోలీసుల దౌర‍్జన‍్యం
కృష్ణా జిల్లా జి. కొండూరు మండలంలో వైఎస్‌ఆర్సీపీ నేతలకు పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి.
విజయవాడ: కృష్ణా జిల్లా జి. కొండూరు మండలంలో వైఎస్‌ఆర్సీపీ నేతలకు పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి. మట్టి వివాదంలో పామర్తి సాంబశివరావు, వంశీ అనే వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసులు నమోదు చేయకుండా పలు పోలీస్‌స్టేషన‍్లకు తిప్పుతున్నారు. మంత్రి దేవినేని ఉమ ఆదేశాలతోనే పోలీసులు అత్యుత్సాహం చూపుతూ వైఎస్సార్‌సీపీ నేతలను కావాలని వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు. పోలీసుల దాష్టీకానికి నిరసనగా ఆయన జి.కొండూరు పోలీసు స్టేషన్ ఎదుట సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. వైఎస్సార్‌సీపీ నేతలను తక్షణం విడుదల చేయాలని, అంతవరకూ ఆందోళన ఆగదని ఆయన హెచ‍్చరించారు.