
సాక్షి,అనంతపురం:తాడిపత్రిలో టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మద్యం మాఫియా గుట్టు బయటపడింది.మద్యం షాపులన్నీ మాకే కావాలని జేసీ వర్గీయులు అంటున్నారు. ఎవరైనా టెండర్లు వేస్తే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు.తమ అనుమతి లేనిదే తాడిపత్రిలో ఎవరికీ రూములు అద్దెకు ఇవ్వొద్దని హెటల్ యజమానులకు టీడీపీ నేతలు అల్టిమేటం జారీ చేశారు.
ఇంత జరుగుతున్నా తాడిపత్రిలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తుండటం గమనార్హం. మరోవైపు మద్యం షాపులకు దరఖాస్తుల గడువును టీడీపీ నేతల కోసమే పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నెల్లూరులో మద్యంషాపులన్నీ తమ సిండికేట్‌కే దక్కాలని మంత్రి నారాయణ మాట్లాడిన ఫోన్ సంభాషణ బయటపడిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తు గడువు పెంపు