ఎలక్టోరల్‌ బాండ్‌పై సుప్రీం కీలక తీర్పు, జయఠాకూర్‌.. ఇంతకీ ఎవరీమె? | Jaya Thakur Of Congress Who Filed Plea Against Electoral Bonds In Supreme Court | Sakshi
Sakshi News home page

ఎలక్టోరల్‌ బాండ్‌పై సుప్రీం కీలక తీర్పు.. తెరపైకి జయఠాకూర్‌ ఇంతకీ ఎవరీమె?

Mar 11 2024 4:14 PM | Updated on Mar 11 2024 5:19 PM

Jaya Thakur Of Congress Who Filed Plea Against Electoral Bonds In Supreme Court - Sakshi

ఎలక్టోరల్‌ బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. బాండ్లు కొన్నదెవరు?  ఆ మొత్తాలు ఏ పార్టీకి వెళ్లాయన్న వివరాలను మార్చి 12 తేదీ (మంగళవారం)లోపు వెల్లడించాల్సిందేనని సుప్రీంకోర్టు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు స్పష్టం చేసింది కూడా.  ఈ వివరాలను బహిరంగ పరచాలని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్లలో ఒకరైన జయ ఠాకూర్‌ కూడా సుప్రీంకోర్టు తీర్పుపై సంతోషంగా ఉన్నట్లు సోమవారం తెలిపారు. ఇంతకీ ఏమిటీ ఎలక్టోరల్‌ బాండ్లు? 

ఎలక్టోరల్‌ బాండ్‌ అంటే?
రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని గత నెల 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది. మార్చి 6లోగా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను ఎన్నికల సంఘానికి అందించాలని నాడు ఎస్‌బీఐని సుప్రీం ఆదేశించింది. ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్‌బీఐ సుప్రీంను ఆశ్రయించింది.  

సుప్రీం కోర్టు అసహనం
తాజాగా, దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఎస్‌బీఐ మరింత సమయం కోరడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. రేపటిలోగా విరాళాల వివరాల్ని వెల్లడించాలని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై పిటిషన్‌ జయఠాకూర్‌ స్పందించారు. 

జయ ఠాకూర్ ఎవరు?
జాతీయ మీడియా కథనాల ప్రకారం..మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాకు చెందిన జయ ఠాకూర్‌కు కాంగ్రెస్‌తో అనుబంధం ఉంది. ఆమె వృత్తి రీత్యా డాక్టర్. మరోవైపు  మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారు. 

పారదర్శకత లేదు
ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఎన్నికల నిధులలో పారదర్శకత తగ్గిపోయిందని జయ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.“డబ్బు విరాళాలు ఇస్తున్న వ్యక్తులు, వారి పేర్లు వెల్లడించడం లేదు. ఇది మన ప్రజాస్వామ్యానికి భవిష్యత్తులో సమస్యను సృష్టిస్తుందని నేను ఆ సమయంలో (2018) గ్రహించాను. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిధులే పెద్ద సమస్య’. ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు విరుద్ధమని తాను అనుకోవడం లేదు. ఏ పార్టీ, ఏ కార్పొరేట్ గ్రూప్ నుండి నిధులు పొందుతుందో, వారు తప్పనిసరిగా కార్పొరేట్ గ్రూప్ పేరును బహిర్గతం చేయాలని నేను భావిస్తున్నాను అని ఆమె అన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement