వాలంటీర్లపై జనసేన గూండాల అమానుషం.. గదిలో బంధించి! | Janasena Rowdies Locked Volunteers In Room At Kakinada | Sakshi
Sakshi News home page

వాలంటీర్లపై జనసేన గూండాల అమానుషం.. గదిలో బంధించి!

Apr 11 2024 1:56 PM | Updated on Apr 11 2024 2:46 PM

Janasena Rowdies Locked Volunteers In Room At Kakinada - Sakshi

సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో వాలంటీర్లపై జనసేన గూండాల అమానుషంగా ప్రవర్తించారు. ఆరుగురు వాలంటీర్లను రెండు గంటల పాటు ఓ గదిలో నిర్భంధించి తాళం వేశారు. గదిలో ఫర్నిఛర్ ధ్వంసం చేసి వాలంటీర్లపై దౌర్జన్యం చేశారు. వాలంటీర్లలో ఏడు నెలల గర్భవతి ఉన్నా జనసేన గూండాలు కనికరించలేదు.

తమ తోటి వాలంటీర్ పుట్టిన రోజు సందర్భంగా రమణయ్యపేట మోక్షిత ఫైనాన్స్ కంపెనీలో వీరంతా కలుసుకున్నారు. స్వీట్స్, కూల్ డ్రీంక్స్ తీసుకొని ఆనందంగా మాట్లాడుకున్నారు. అయితే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న నెపంతో లోపలికి చొరబడిన కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీ, తన కార్యకర్తలతో కలసి  వాలంటీర్లపై దాడికి దిగారు. రెండు గంటల పాటు వాలంటీర్లను నిర్బంధించి నానా హంగామా చేశారు.  

జనసేన దౌర్జన్యానికి గర్భంతో ఉన్న వాలంటీర్ సొమ్మసిల్లి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్నికల అధికారులు గదిలోకి వెళ్లి చూడగా అక్కడ కూల్‌ డ్రింక్స్‌, స్వీట్స్‌ గుర్తించారు. కాగా పంతం నానాజీ తీరుపై వాలంటీర్లు మండిపడుతున్నారు. జనసేన గుండాలపై పోలీసు ఫిర్యాదుకు భాధిత వాలంటీర్లు సిద్ధమవుతున్నారు.
చదవండి: పవన్‌కు వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు!

Advertisement
 
Advertisement
Advertisement