నోరు పారేసుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి | Jammalamadugu Mla Adinarayana Reddy Overaction | Sakshi
Sakshi News home page

నోరు పారేసుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి

Jul 1 2026 9:55 PM | Updated on Jul 1 2026 10:01 PM

Jammalamadugu Mla Adinarayana Reddy Overaction

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నోరు పారేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని చెప్పుతో కొడతానంటూ దూషణకు దిగారు. ‘‘అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయారు. కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లు అధికారంలో ఉంటుంది. అప్పటిలోగా వైఎస్సార్‌సీపీ నేతలకు సినిమా చూపిస్తా’’ అంటూ ఆదినారాయణరెడ్డి బెదిరింపులకు దిగారు.

ఇవాళ జిందాల్ స్టీల్ సందర్శనకు వైఎస్సార్‌సీపీ పిలుపునివ్వగా.. పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసిన జిందాల్ స్టీల్‌కు మళ్ళీ శంకుస్థాపనకు చంద్రబాబు సిద్ధమయ్యారు. వైఎస్‌ జగన్‌ హయాంలోనే భూమి పూజ పూర్తయి, పనులు కూడా ప్రారంభమైన జిందాల్‌ స్టీల్‌ ప్లాంట్‌కు చంద్రబాబు మళ్లీ భూమి పూజ చేస్తూ ‘క్రెడిట్ చోరీ’కి పాల్పడటాన్ని ప్రజల ముందు ఉంచడానికి వైఎస్సార్‌సీపీ చలో జిందాల్ కార్యక్రమం తలపెట్టింది. ఈ సందర్భంలో వైఎస్సార్‌సీపీ నేతలపై ఆదినారాయణరెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement