మునుగోడును దత్తత తీసుకుంటా: కేటీఆర్‌ | I Will Adopt Munugode Constituency Minister KTR | Sakshi
Sakshi News home page

మునుగోడును దత్తత తీసుకుంటా: కేటీఆర్‌

Nov 6 2022 8:19 PM | Updated on Nov 6 2022 9:05 PM

I Will Adopt Munugode Constituency Minister KTR - Sakshi

హైదరాబాద్‌: మునుగోడులో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.  ఎన్నికల హామీలో భాగంగా తాను ఇచ్చిన మాట ప్రకారం మునుగోడు అభివృద్ధికి కృషి చేస్తానని ట్వీటర్‌ ద్వారా కేటీఆర్‌ వెల్లడించారు. ముందుగా తమ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి కేటీఆర్‌ అభినందనలు తెలియజేశారు.

టీఆర్‌ఎస్‌పై, కేసీఆర్‌పై నమ్మకం ఉంచి గెలిపించినందుకు ఆ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తాను చెప్పిన హామీ ప్రకారం మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్‌ తెలిపారు. రానున్న రోజుల్లో పెండింగ్‌ అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని అన్నారు. 

ఇక్కడ చదవండి: మునుగోడులో టీఆర్‌ఎస్‌ భారీ విజయం.. 

టీఆర్‌ఎస్‌కు ఆయనో గోల్డెన్‌లెగ్‌.. ఉప ఎన్నికల్లో రికార్డులు బ్రేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement