‘ఆ ప్రశ్నకు టీడీపీ నుంచి ఇంతవరకు సమాధానమే లేదు’ | Gurazala MLA Kasu Mahesh Reddy Fires On TDP | Sakshi
Sakshi News home page

‘ఆ ప్రశ్నకు టీడీపీ నుంచి ఇంతవరకు సమాధానమే లేదు’

Nov 12 2021 2:21 PM | Updated on Nov 12 2021 3:36 PM

Gurazala MLA Kasu Mahesh Reddy Fires On TDP - Sakshi

సాక్షి, గుంటూరు: యుద్ధాలు చేస్తాం, మీసాలు తిప్పుతాం, తొడలు చరుస్తాం అనే మాటలన్నీ టీడీపీ వాళ్లు సోషల్ మీడియాలో ప్రచారం కోసం చేసే చీప్ ట్రిక్స్ అని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి అన్నారు. మున్సిపల్‌ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ..  2019లో వైఎస్సార్‌సీపీ సత్తా ఏంటో చూపించాం. ప్రజలే నిర్ణయించారు మగాళ్లు ఎవరు.. మడత గాళ్లు ఎవరు అనేది. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చంద్రబాబు డబ్బులు పంపితే రేవంత్‌రెడ్డి పట్టుబడలేదా, అదేమైనా ప్రతపక్షాల కుట్రా..?. దాచేపల్లి పట్టణంలో చంద్రబాబు డబ్బులు పంపితే మద్యం పంచుతూ ఒకరిద్దరు టీడీపీకి చెందిన వ్యక్తులను అరెస్ట్‌ చేస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఏంటి సంబంధం..?. దాచేపల్లి పట్టణానికి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పాలి అని ప్రశ్నిస్తే ఇంతవరకు జవాబు లేదు.

దమ్ము, ధైర్యం గురించి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. దమ్ము ధైర్యం పుష్కలంగా ఉండబట్టే కదా 2019లో పోరాటాలు చేసి గెలిచింది. రాష్ట్రంలో ఏ ఎలక్షన్‌కి వెళ్లిన వైఎస్సా్ర్‌సీపీనే గెలుస్తుంది అంటే ప్రజల మనసుల్లో మా పార్టీ పదిలంగా ఉంది అని అర్థం. 1996 నుంచి ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతిని చంద్రబాబే తీసుకువచ్చాడు. డబ్బులు పంచే సంస్కృతి ఈ రోజు యావత్తు రాష్ట్రాన్ని దహించివేస్తుంది. మేము పట్టుబట్టి దాచేపల్లి, గురజాలని మున్సిపాల్టీలుగా చేశాం. తెలుగుదేశం నాయకులు కోర్టులకు వెళ్లి ఎన్నికలు ఆపాలని చూశారు. ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు' అంటూ కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. 

చదవండి: (అసలు లోకేష్‌కు ఎయిడెడ్‌ విద్యాసంస్థలంటే ఏంటో తెలుసా..?: ఆదిమూలపు సురేష్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement