కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి | GHMC Mayor Vijaya Lakshmi Joined In Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి

Mar 30 2024 11:45 AM | Updated on Mar 30 2024 12:34 PM

GHMC Mayor Vijaya Lakshmi Joined In Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌ సమక్షంలో ఆమె హస్తం గూటికి చేరుకున్నారు. 

కాగా, కొద్దిరోజలుగా మేయర్‌ విజయలక్ష్మి కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఆమె హస్తం గూటికి చేరారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌ నివాసానికి చేరుకున్న విజయలక్ష్మి.. సీఎం, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇక, అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ కూడా హస్తం తీర్థం పుచ్చుకున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement