ప్రధాని మోదీ రాక; కేసీఆర్ అవసరం లేదు

ప్రధానికి స్వాగతం పలకనున్న ఆ ఐదుగురు
సీఎం కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు
సీఎస్‌కు తెలియజేసిన ప్రధాని కార్యాలయం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్ పర్యటన సందర్భంగా హకీంపేట ఎయిర్‌పోర్టులో ఆయనకు స్వాగతం తెలపడానికి కేవలం ఐదుగురు అధికారులకు మాత్రమే ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అనుమతించింది. శనివారం మధ్యాహ్నం హకీంపేట విమానాశ్రయానికి చేరుకొనే ప్రధానికి సీఎం కేసీఆర్ స్వాగతం పలుకుతారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పీఎంవోకు సమాచారమిచ్చింది. అయితే ప్రధానికి స్వాగతం పలకడానికి సీఎం రావాల్సిన అవసరం లేదని ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్... సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఫోన్లో తెలిపినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధానికి స్వాగతం చేప్పడానికి హకీంపేట ఎయిర్ ఆఫీస్ కమాండెంట్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతా మొహంతి, సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాత్రమే రావాలని పీఎంవో ఆదేశాలు పంపింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి