సీబీఐ విచారణ కోరే దమ్ముందా: కాకాణి సవాల్‌ | Former Minister Kakani Comments On Somireddy Chandramohanreddy | Sakshi
Sakshi News home page

సీబీఐ విచారణ కోరే దమ్ముందా: సోమిరెడ్డికి మాజీ మంత్రి కాకాణి సవాల్‌

Oct 5 2024 11:51 AM | Updated on Oct 5 2024 4:45 PM

Former Minister Kakani Comments On Somireddy Chandramohanreddy

సాక్షి,నెల్లూరు:సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఇసుక అక్రమ రవాణాలో తనకు సంబంధం ఉందని నిరూపించే ధైర్యం సోమిరెడ్డికి ఉందా అని కాకాణి ప్రశ్నించారు.శనివారం(అక్టోబర్‌5) ఈ విషయమై కాకాణి మీడియాతో మాట్లాడారు.

‘తాను చెప్పిన పనులు అధికారులు చెయ్యడం లేదనే  ఫ్రస్టేషన్‌లో  సోమిరెడ్డి ఉన్నారు.తాను చెప్పిన వారిని కేసుల్లో ఇరికించడం లేదని సోమిరెడ్డి బాధపడుతున్నారు.సోమిరెడ్డి బతుకు అంతా అవినీతిమయం.కేసులు,అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు. దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడితే మా ప్రభుత్వం వచిన తర్వాత మంచంలో పడుకుని ఉన్నాలాక్కొస్తాం. 

నా పై చేస్తున్న అవినీతి ఆరోపణలలో ఒక్క దానినైనా రుజువు చెయ్యగలవా?నీకు దమ్ము దైర్యం ఉంటే నేను అవినీతి చేసినట్టు నిరూపించు. సూరాయి పాలేం ఇసుక రీచ్‌లో జరుగుతున్న తవ్వకాల మీద గ్రీన్ ట్రిబ్యునల్‌కి వెళ్తున్నాం. 

నీరు చెట్టులో జరిగిన అవినీతి మీద విచారణకి అదేశిస్తే అధికారుల ఉద్యోగాలు పోతాయని మానవత్వంతో వెనక్కి తగ్గాను. మైనింగ్ కాంట్రాక్టర్లతో చంద్రబాబు వద్దకు సోమిరెడ్డి వెళ్తే  అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.సోమిరెడ్డి అవినీతి మీద విచారణ వేయాలి.ఆయన చేసిన అవినీతి బయటడుతుంది’అని కాకాణి అన్నారు. 

ఇదీ చదవండి: సిగ్గూ ఎగ్గూ లేకుండా కోర్టు తీర్పు వక్రీకరణ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement