రుణమాఫీపై మార్గదర్శకాలు.. అది కాంగ్రెస్‌కు అలవాటే: హరీష్‌ రావు సెటైర్లు | Ex Minister Harish Rao Satirical Comments On Congress Govt Over Runa Mafi, More Details Inside | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై మార్గదర్శకాలు.. అది కాంగ్రెస్‌కు అలవాటే: హరీష్‌ రావు సెటైర్లు

Jul 15 2024 7:14 PM | Updated on Jul 15 2024 7:35 PM

Ex Minister Harish Rao Satirical Comments On Congress Govt

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్‌ రావు సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. కాంగ్రెస్‌ వాళ్లు చెప్పేదొకటి.. చేసేదొకటి.. ఇది వారికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.

కాగా, తెలంగాణలో రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై హరీష్‌రావు కౌంటరిచ్చారు. కాగా, హరీష్‌ రావు ట్విట్టర్‌ వేదికగా.. రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టం. 

సంబంధిత వార్త: రుణమాఫీపై బిగ్‌ ట్విస్ట్‌.. ప్రభుత్వం మార్గదర్శకాలు 

ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారింది.

 

 

డిసెంబర్ 12, 2018 వరకు ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన అసమంజసం. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతున్నది. ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే. ఎన్నికలప్పుడు  మభ్య పెట్టారు, అధికారం వచ్చిన తర్వాత ఆంక్షలు పెట్టారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement