వాలంటీర్లపై మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు

Dharmana Prasada Rao Comments On Village Volunteer System - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం వస్తే మొట్టమొదటగా తుపాకీ పేలేది వాలంటీర్లపేనే అని కామెంట్స్‌ చేశారు. 

కాగా, మంత్రి ధర్మాన సోమవారం శ్రీకాకుళంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ధర్మాన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు కోసమే ఈనాడు అసత్య కథనాలు ప్రచురిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే మొదట తుపాకీ పేలేది వాలంటీర్లపైనే. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పాల్సింది వాలంటీర్లే. అయితే, వాలంటీర్లు తెలివైన వారు కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించాలి’ అని వారిని కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top