ఎందుకీ కన్ఫ్యూజన్?.. చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సెటైర్లు | Cpi Ramakrishna Satires On Chandrababu | Sakshi
Sakshi News home page

ఎందుకీ కన్ఫ్యూజన్?.. చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సెటైర్లు

May 5 2024 12:36 PM | Updated on May 5 2024 12:36 PM

Cpi Ramakrishna Satires On Chandrababu

40 ఏళ్ల సీనియారిటీ అని చెప్పే చంద్రబాబుకు ఉన్న కన్ఫ్యూజన్ ఎవరికి లేదంటూ సీపీఐ రామకృష్ణ సెటైర్లు వేశారు.

సాక్షి, విజయవాడ: 40 ఏళ్ల సీనియారిటీ అని చెప్పే చంద్రబాబుకు ఉన్న కన్ఫ్యూజన్ ఎవరికి లేదంటూ సీపీఐ రామకృష్ణ సెటైర్లు వేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ గురించి మాట్లాడుతున్న బాబు.. ఆ చట్టం తీసుకొచ్చింది బీజేపీనే అనే సంగతి మరిచాడా ? అంటూ ప్రశ్నించారు.

‘‘సభల్లో వైఎస్సార్‌సీపీపై మాట్లాడుతున్న బాబు.. బీజేపీ గురించి ఎందుకు మాట్లాడం లేదు? బీజేపీతో జోడి కట్టి ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తానంటే మోసం కదా?. నాడు మోదీని తిట్టిన బాబు నేడు పొగుడుతున్నారు.. నాలుగేళ్లలో మోదీ ఏం చేశాడు? మోదీ రాష్టానికి చేసిన మేలు ఏంటో బాబు చెప్పాలి?’’ అని రామకృష్ణ నిలదీశారు.

‘‘కూటమి మ్యానిఫెస్టో విడుదలలో పురందేశ్వరి ఎందుకు లేదు? కూటమి మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ నేతలు చెప్పడం దేనికి సంకేతం. అవకాశవాదం, స్వార్థంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు’’ అంటూ రామకృష్ణ మండిపడ్డారు.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement