యూపీ బీజేపీలో కరోనా కలకలం.. ఎంపీకి పాజిటివ్‌.. నిన్నంతా సీఎం యోగీతోనే | Covid Scare in UP BJP: Radha Mohan Singh Tests Positive Day After Party Meet With CM Yogi | Sakshi
Sakshi News home page

Uttar Pradesh: యూపీ బీజేపీలో కరోనా కలకలం.. ఎంపీకి పాజిటివ్‌.. నిన్నంతా సీఎం యోగీతోనే

Jan 11 2022 8:03 PM | Updated on Jan 11 2022 9:09 PM

Covid Scare in UP BJP: Radha Mohan Singh Tests Positive Day After Party Meet With CM Yogi - Sakshi

లక్నో: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ బీజేపీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాధామోహన్‌ సింగ్ వైరస్ బారినపడ్డారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌తో కలిసి ఎన్నికల సమావేశంలో పాల్గొన్న గంటల వ్యవధిలోనే ఆయనకు పాజిటివ్ అని తేలింది. ఈ భేటీలో సీఎం యోగి పక్కనే రాధామోహన్‌సింగ్‌ కూర్చోని, అభ్యర్థుల ఎంపికపై చర్చించడం గమనార్హం. 
చదవండి: భారీగా కేసులు.. వారందరికీ వర్క్‌ ఫ్రం హోం ఇవ్వండి!

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్వహించిన ఈ సమావేశంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, యూపీ బీజేపీ చీఫ్‌ స్వతంత్ర దేవ్‌ పాల్గొన్నారు. అయితే స్వల్ప లక్షణాలు ఉండటంతో హోమ్ ఐసోలేషన్‌ ఉన్నట్లు  రాధామోహన్‌ ట్వీట్‌ చేశారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, తనను ఇటీవల కలిసిన వారందరూ కోవిడ్‌ టెస్ట్‌ చేసుకోవాలని సూచించారు.  ఈ నేపథ్యంలో యూపీ బీజేపీ ఆఫీస్‌ సిబ్బంది మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
చదవండి: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement