హైదరాబాద్‌కు సుప్రీం బెంచ్‌ తెస్తాం | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు సుప్రీం బెంచ్‌ తెస్తాం

Published Sat, May 4 2024 1:04 AM

Congress releases Telangana specific manifesto for Lok Sabha polls

ఏపీలో విలీనమైన 5 గ్రామాలను రాష్ట్రంలో తిరిగి కలుపుతాం 

పాలమూరు ప్రాజెక్టు, మేడారానికి జాతీయ హోదా కల్పిస్తాం 

లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్‌ హామీలు.. 23 అంశాలతో ప్రత్యేక మేనిఫెస్టో విడుదల 

పాల్గొన్న పార్టీ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సమాజం కోరుకునే మొత్తం 23 అంశాలతో లోక్‌సభ ఎన్నికల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర మేనిఫెస్టోను రూపొందించామని టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తామన్నారు. హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయడం సహా వివిధ హామీలు అమలు చేస్తామని తెలిపారు.

 శుక్రవారం గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ ఆధ్వర్యంలో లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. పాంచ్‌న్యాయ్, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ సభ్యులు రియాజ్, ఆల్దాసు జానయ్య, వినోద్‌కుమార్, కమలాకర్‌రావు, అనంతుల శ్యాంమోహన్, లింగం యాదవ్, కప్పర హరిప్రసాదరావు, పార్టీ నేతలు మెట్టు సాయికుమార్, చనగాని దయాకర్‌ పాల్గొన్నారు. 

నీతి ఆయోగ్‌ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తాం.. 
ప్రత్యేక మేనిఫెస్టో విడుదల సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ నీతి ఆయోగ్‌ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో పెట్టాలని నిర్ణయించామన్నారు. అలాగే పలు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని, ఏపీలో విలీనమైన 5 గ్రామాలను తెలంగాణలో కలుపుతామని హామీ ఇచ్చా రు. 

బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని శ్రీధర్‌బాబు విమర్శించారు. గత పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్‌ తెలంగాణకు ఏమీ చేయలేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక పాలనను గాడిలో పెట్టామని చెప్పారు. అనంత రం దీపాదాస్‌ మున్షీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలిచి రాజ్యాంగా న్ని మార్చాలని ప్రధాని మోదీ ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement