రాజాగోపాల్‌ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Congress MP Komatireddy Venkat Reddy Comments On Rajagopal Reddy Arrest - Sakshi

కేసీఆర్‌ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారు: కోమటిరెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: మంత్రి జగదీష్‌ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఘటనలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని బుధవారం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, కార్యకర్తల అరెస్ట్‌ను ఖండించారు. అరెస్ట్ చేసిన రాజగోపాల్‌రెడ్డి, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రొటోకాల్ పాటించకుండ అవమానిస్తున్నారు అని అసహనం వ్యక్తం చేశారు. హిట్లర్‌ కంటే దారుణంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండి పడ్డారు. 

సీఎం కేసీఆర్‌ ప్రకటించిన ‘దళిత బంధు’ పథకాన్ని మునుగోడు నియోజకవర్గ దళితులకు కూడా వర్తింపచేయాలని కోరుతూ.. రాజగోపాల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి బుధవారం మంత్రి జగదీష్‌ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు రాజగోపాల్‌ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top