Sakshi News home page

సీఎం రేవంత్‌ చిట్‌చాట్‌.. కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు

Published Thu, Feb 8 2024 4:52 PM

Cm Revanth Comments On Brs Room Change In Telangana assembly - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ ప్రసంగం​ తర్వాత రేవంత్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. కేసీఆర్ ఎక్స్‌పైరీ మెడిసిన్ అని, ఆయన ఇంకా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్‌ను పట్టించుకోవడంలేదని చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి, బీఏసీకి కూడా రాలేదంటే కేసీఆర్‌ చిత్తశుద్ధిని అర్ధం చేసుకోవచ్చన్నారు.

కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానన్నారు. ప్రతిపక్షనేతగా ఆయన తన బాధ్యత నిర్వర్తించాలన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గది మార్పు నిర్ణయం స్పీకర్‌కు సంబంధించినదని చెప్పారు. బీఏసీ సమావేశానికి రాకుండా హరీశ్‌రావును తాము ఎందుకు అడ్డుకుంటామన్నారు.

బీఏసీకి వచ్చేవారి జాబితాలో కేసీఆర్ కడియం శ్రీహరి పేరు ఇచ్చారన్నారు. హరీశ్‌రావుకు బీఏసీకి అనుమతివ్వాలో లేదో స్పీకర్‌ నిర్ణయిస్తారు. రేపు బీఏసీకి కేసీఆర్‌ మనవడు హిమాన్షు కూడా వస్తానంటే ఎలా అని రేవంత్‌ ప్రశ్నించారు. 

ఈ అసెంబ్లీ సెషన్‌లో రాష్ట్రంలో కులగణణపై తీర్మానం ఉంటుందని చెప్పారు. టీఎస్పీఎస్సీపై పూర్తి పప్రొసీజర్‌ ప్రకారం ముందుకు వెళుతున్నామన్నారు. మరిన్ని అంశాలు చర్చించాల్సిన అవసరం ఉంది అనుకుంటే స్పీకర్ సభను పొడిగించవచ్చన్నారు.

కృష్ణా రివర్‌ బోర్డు మేనేజ్‌మెంట్‌(కేఆర్‌ఎంబీ)కి ప్రాజెక్టులను అప్పగించింది గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని చెప్పారు. కృష్ణా బేసిన్‌లో​ బీఆర్‌ఎస్‌ను ప్రజలు తిరస్కరించారని చెప్పారు. సీఎంగా తాను ఎవరినైనా కలుస్తానని, అవసరమైతే కేసీఆర్‌ను కూడా కలుస్తానని రేవంత్‌ అన్నారు.  

ఇదీ చదవండి.. తెలంగాణలో బీజేపీది ఒంటరి పోరే  

Advertisement
Advertisement