రేపు కవితను అరెస్ట్‌ చేయొచ్చు: సీఎం కేసీఆర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Cm Kcr Responded To The Ed Notices To Kavitha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. కవితను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని కేసీఆర్‌ అన్నారు. ‘‘రేపు విచారణ పేరుతో కవితను అరెస్ట్‌ చేసి ఇబ్బంది పెట్టొచ్చు. చేసుకుంటే చేసుకోనీ అందర్నీ వేధిస్తున్నారు. కేసులకు భయపడేది లేదు. న్యాయపోరాటం చేస్తాం. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం’’ అంటూ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘‘బీజేపీలో చేరని వారిని కేసులతో వేధిస్తున్నారు. కవితను కూడా చేరమన్నారు. ​​​మహా అయితే ఏం చేస్తారు.. జైలుకు పంపుతారు’’ అంటూ కేసీఆర్‌ మండిపడ్డారు.

కాగా, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో శుక్రవారం బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని, ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్సే గెలుస్తుందని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ‘‘డిసెంబర్‌లో జరిగే ఎన్నికలకు ప్లాన్‌ చేసుకోండి. అవసరమైన చోట యాత్రలు, పాదయాత్రలు నిర్వహించాలి’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.
చదవండి: ఎమ్మెల్యే కాల్‌ చేసి బయటకు రమ్మంటున్నారు: తాటికొండ రాజయ్యపై మహిళా సర్పంచ్‌ సంచలన ఆరోపణలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top