కాంగ్రెస్‌వాళ్లే రైతుబంధు ఆపారు.. సిగ్గుందా?: కేసీఆర్‌

CM KCR Participated In BRS Campain At Shadnagar And Other Areas - Sakshi

సాక్షి, షాద్‌నగర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అన్నీ బాధలే. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించుకున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయాలని ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. సోమవారం సీఎం కేసీఆర్‌ షాద్‌నగర్‌ బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు.

‘ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాంటి వారో అన్నీ చూసి ఓటు వేయాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నాం. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయ్యాలి. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక పెన్షన్‌ రూ.5వేలు వరకు ఇస్తాం. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. రైతుబంధు ఉండాలంటే మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తారట. ధరణి స్థానంలో భూమాత తెస్తామంటున్నారు. 

కాంగ్రెస్‌ వాళ్లే రైతుబంధును ఆపారు. కాంగ్రెస్‌లో కూడా రైతుబంధు తీసుకున్న నేతలు, కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్‌ వాళ్లకు సిగ్గు ఉందా?. రైతుల నోటికాడ బుక్క గుంజుకుంటారా?. షాద్‌నగర్‌ వరకు మెట్రో తెచ్చే బాధ్యత నాది. షాద్‌నగర్‌కు మెట్రో వస్తే.. ఇక్కడ భూముల ధరలు మూడింతలు పెరుగుతాయి. రైతుబంధు ఆపేస్తే కాంగ్రెస్‌ వాళ్లకు కూడా నష్టమే. కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదుతోనే రైతుబంధును ఈసీ నిలిపివేసింది. పాలమూరు ఎత్తిపోతలు పూర్తి కాకుండా కాంగ్రెస్‌ వాళ్లే స్టేలు తెచ్చారు’ అంటూ విమర్శలు చేశారు. 

తెలంగాణను ఊటగొట్టిన పార్టీ కాంగ్రెస్..
తెలంగాణను ఊటగొట్టిన పార్టీ కాంగ్రెస్ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ చరిత్ర ప్రజలకు తెలుసని అన్నారు. తెలంగాణను సాధించేందుకే ఈ పార్టీ పుట్టిందని గుర్తు చేశారు. ఓటు తలరాతను మారుస్తుందని పేర్కొన్నారు. ఆచితూచి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఆందోల్‌లో నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. 

పార్టీల చరిత్ర, అభ్యర్థుల చరిత్రను గమనించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. ప్రజల హక్కులను కాపాడే పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత పెన్షన్లు రూ.5వేలకు పెంచామని తెలిపారు. కంటి వెలుగు వంటి మంచి కార్యక్రమాలతో అభివృద్ధి దిశగా నడిచామని స్పష్టం చేశారు.    
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

27-11-2023
Nov 27, 2023, 15:52 IST
‘ప్రచారానికి వెళ్లిన ప్రతి చోటా ప్రజల నుంచి నాకు ఆదరణ లభిస్తోంది. భారీ మెజార్టీతో విజయం సాధిస్తానన్న ధీమా ఏర్పడింది....
27-11-2023
Nov 27, 2023, 14:36 IST
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలు.. 
27-11-2023
Nov 27, 2023, 13:38 IST
సాక్షి, మహబూబాబాద్‌: తెలంగాణలో బీజేపీ కొత్త చరిత్ర లిఖించబోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారని అన్నారు. కాంగ్రెస్‌,...
27-11-2023
Nov 27, 2023, 13:15 IST
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల పోలింగ్‌ శాతం పెరిగితే గెలుపోటములపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి కొత్త...
27-11-2023
Nov 27, 2023, 12:28 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: 'శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో...
27-11-2023
Nov 27, 2023, 12:28 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/స్టేషన్‌ మహబూబ్‌నగర్‌/దేవరకద్ర/నారాయణపేట: ‘జిల్లా అభివృద్ధి బాట పట్టాలన్నా.. సాగునీటి ప్రాజెక్టులతోపాటు జిల్లాలోని వేలాదిమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ,...
27-11-2023
Nov 27, 2023, 11:02 IST
సాక్షి, కరీంనగర్‌: 'ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులను ఎన్నుకోవడానికి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల...
27-11-2023
Nov 27, 2023, 10:12 IST
మిర్యాలగూడ టౌన్‌: పోలింగ్‌ కేంద్రంలో అభ్యర్థుల తరఫున ఓటరు పరిశీలనలో పోలింగ్‌ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకం అని చెప్పవచ్చు....
27-11-2023
Nov 27, 2023, 10:05 IST
సాక్షి, ఆదిలాబాద్‌/నిర్మల్‌: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలను చిత్తుగా ఓడించా లని, బీజేపీని గెలిపించాలని బీజేపీ ఆది లాబాద్‌ అభ్యర్థి...
27-11-2023
Nov 27, 2023, 09:55 IST
కొడంగల్‌: కొడంగల్‌ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఈ ప్రాంత ఓటర్లు ఆరు సార్లు హస్తానికి పట్టం కట్టారు. ఆ...
27-11-2023
Nov 27, 2023, 09:53 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసే దిశగా ప్రజలను సన్నద్ధం చేసేందు కోసం స్వీప్‌ ఆధ్వర్యంలో జిల్లా అధికార...
27-11-2023
Nov 27, 2023, 09:47 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌: ‘ప్రచారంలో అటు తిరిగి ఇటు వచ్చే లోగా రోజు గడిచిపోతుంది. ఏ రోజు అనుకున్న పనులు ఆ రోజు అవట్లేదు....
27-11-2023
Nov 27, 2023, 09:47 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నేను నామినేషన్‌ వేసిన రోజే ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి నన్ను...
27-11-2023
Nov 27, 2023, 09:20 IST
సాక్షి, నిజామాబాద్‌/హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీలో ఓవైసీలు టెర్రరిస్టులను పెంచి పోషిస్తూ పాతబస్తీని మినీ పాకిస్థాన్‌గా మార్చారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌...
27-11-2023
Nov 27, 2023, 08:54 IST
సాక్షి, నిజామాబాద్‌: ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన ప్రవాసులకు ఓటు హక్కు వినియోగించుకునే వీలు లేకుండా పోతోంది. వయోవృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్‌...
27-11-2023
Nov 27, 2023, 08:46 IST
సాక్షి, నిజామాబాద్‌: 'రెండుమార్లు బాల్కొండ నియోజకవర్గం ప్రజలు చూపిన ఆదరణతో, సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో రూ.వేల కోట్ల నిధులు బాల్కొండ నియోజకవర్గం...
27-11-2023
Nov 27, 2023, 08:30 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ తన ఉద్యోగం కోసం యువతను రెచ్చగొడుతున్నారు. కాంగ్రెస్‌ విడుదల చేసిన జాబ్‌...
27-11-2023
Nov 27, 2023, 08:29 IST
సాక్షి, నిజామాబాద్‌/కామారెడ్డి: తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ‘ప్రజల తెలంగాణ’ కలను నిజం చేయడానికి కామారెడ్డి ప్రజలు రేవంత్‌రెడ్డిని భారీ మెజారిటీతో...
27-11-2023
Nov 27, 2023, 07:54 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌/నారాయణపేట: ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న చేనేత కార్మికుల ఉపాధి అవకాశాలు పెంచి.. జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు నారాయణపేట జిల్లాకేంద్రంలో...
27-11-2023
Nov 27, 2023, 07:08 IST
సాక్షి, సంగారెడ్డి/తూప్రాన్‌: బీజేపీ కండువా కప్పుకున్న వారికి సంక్షేమ పథకాలు రావని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు బెదిరింపులకు పాల్పడుతున్నారని, పథకాలు... 

Read also in:
Back to Top