ఆ ఓటే కాటేస్తది! 

CM KCR Fires On Congress At Nizamabad Medak Public Meeting - Sakshi

కాంగ్రెస్‌ను నమ్మి అధికారమిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తది 

బోధన్, నిజామాబాద్‌ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌

కాంగ్రెస్‌ పార్టీ ఉన్న తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపింది 

సాగునీరు, తాగునీరు, కరెంటు ఇవ్వకుండా 55 ఏళ్లు గోసపెట్టింది

మన పోరాటాలతో గత్యంతరం లేక ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది 

ఇప్పుడు మన వేళ్లతో మన కళ్లే పొడుచుకునేలా చేస్తోంది 

కాంగ్రెస్‌ ధరణిని బంగాళాఖాతంలో పడేస్తే.. 

రైతులు అరేబియా సముద్రానికి వెళ్లాల్సి వస్తుంది 

2024లో కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.. 

తెలంగాణలో ఎంపీ సీట్లన్నీ గెలిస్తే ఢిల్లీలో తడాఖా చూపించవచ్చన్న సీఎం

కాంగ్రెస్‌ నాయకులు రాహుల్, రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని అంటున్నారు. అలా చేస్తే రైతులు అరేబియా సముద్రానికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటుంది. ధరణి తొలగిస్తే దళారీ వ్యవస్థ రాజ్యమేలుతుంది. రైతులను నంజుకుతింటారు.అది మనకు అవసరమా? 3 గంటల కరెంటు అని పీసీసీ అధ్యక్షుడు చెప్తున్నాడు. పది హెచ్‌పీ మోటార్లు పెట్టాలంటడు. పది హెచ్‌పీ మోటార్లంటే.. 30 లక్షల బోర్లకు రూ.30 వేల కోట్లు ఖర్చు చేయాలె. వాళ్లకు ఏమన్న తెలుస్తుందా? కాంగ్రెస్‌ నాయకులు మన వేళ్లతో మన కళ్లనే పొడుచుకునేలా చేస్తున్నారు.     
– కేసీఆర్‌

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌/ సాక్షి, కామారెడ్డి/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉన్న తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపి 55 ఏళ్లు గోసపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ వస్తోందని, నమ్మి మోసపోతే గోసపడతామని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రాజకీయం అంటే సినిమా మ్యాట్నీ షో కాదని, ఎవరో చెప్పారని కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆ ఓటే కాటేస్తుందని హెచ్చరించారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే దళారులు రాజ్యమేలుతారన్నారు.

ఓటు వేసే ముందు ఎవరు ఏం చేశారో ఆలోచన చేయాలని, తెలంగాణ రాకముందు ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉన్నదీ గమనించాలని కోరారు. అభ్యర్థులు, వాళ్ల వెనుక ఉన్న పార్టీల చరిత్రను చూసి నిర్ణయం తీసుకోవాలని, దుర్మార్గపు కాంగ్రెస్‌ను మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు. బుధవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్, నిజామాబాద్‌ అర్బన్, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, మెదక్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. చరిత్ర మీ కళ్ల ముందే ఉంది. పార్టీ మీముందే పుట్టింది. మీ ముందే పెరిగింది. అదే కాంగ్రెస్‌ ఉన్న తెలంగాణను ఊడగొట్టింది. 55 ఏళ్లు గోస పెట్టింది. సాగునీరు, తాగునీరు, కరెంట్‌ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. రైతుల ఆత్మహత్యలతో గందరగోళ పరిస్థితులు ఉండేవి. అలాంటి కాంగ్రెస్‌ పార్టీ కొత్త రూపంతో వస్తోంది. సంపద పెంచకుండా సర్వనాశనం చేసి మళ్లీ వస్తోంది. దానికి ఓటేసి మోసపోతే గోసపడతాం. దుర్మార్గపు కాంగ్రెస్‌ను మట్టి కరిపించాలి. రాజకీయం అంటే సినిమా మ్యాట్నీ షోకాదు.. ఎవరో చెప్పారని ఓటేస్తే ఆ ఓటే కాటేస్తది. 

కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే! 
వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది. రాష్ట్రంలో ఎంపీ సీట్లన్నీ గెలిస్తే ఢిల్లీలో తడాఖా చూపించొచ్చు. పాలనా సంస్కరణల్లో భాగంగా తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. నవోదయ విద్యాలయాల కోసం ప్రధాని మోదీకి అనేకసార్లు లేఖలు రాశాం. కానీ ఇప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం 157 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. వివిధ పథకాల ద్వారా తెలంగాణకు రూ.25వేల కోట్లు రావాల్సి ఉన్నా ఇవ్వకుండా అడ్డుపుల్లలు వేస్తోంది. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. 

పోరాటాలతోనే రాష్ట్రం వచ్చింది 
యాభై ఐదేళ్లు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్‌ పాలనలో ఎంతో గోసపడ్డాం. మనను తీసుకుపోయి ఆంధ్రలో కలిపి బాధపెట్టారు. తెలంగాణ రాకముందు రైతుల ఆకలి చావులు, నేతన్న ఆత్మహత్యలు, బతుకుదెరువు కోసం వలసలతో పల్లెల పరిస్థితి దారుణంగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌)ను చీల్చేందుకూ కాంగ్రెస్‌ ప్రయత్నించింది.

అయినా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చింది. గత పదేళ్లుగా రా ష్ట్రం ప్రశాంతంగా ఉంది. ఎలాంటి మతకలహాలు లేవు. నిజాం హయాంలో కట్టిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు కాంగ్రెస్‌ హయాంలో ఏవిధంగా తయారైందో ప్రజలకు తెలుసు. మా ప్రభుత్వం వచ్చాక నిజాంసాగర్‌ను పునరుద్ధరించాం. దీనికి కాళేశ్వరం నీటిని అందించేందుకు లింక్‌ ఏర్పాటు చేశాం. 

బీడీ కార్మీకులందరికీ పింఛన్‌ 
రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నం. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చుకున్నం. చెరువులను బాగు చేసుకున్నం. తలసరి ఆదాయంలో నంబర్‌ వన్‌గా నిలిచినం. రైతుబంధును రూ.10 వేల నుంచి ఏడాదికి కొంత పెంచుకుంటూ రూ.16 వేలు చేసుకుందాం. బీడీ టేకేదార్లకు, బీడీ కార్మీకులకు ఉన్న 2014 ఏడాది కటాఫ్‌ను తొలగించి పీఎఫ్‌ ఉన్న ప్రతిఒక్కరికీ పింఛన్‌ అందిస్తాం. వారితోపాటు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కిడ్నీ బాధితుల పింఛన్లు రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచుకుందాం..’’అని కేసీఆర్‌ పేర్కొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

15-11-2023
Nov 15, 2023, 20:58 IST
పోలింగ్‌ తేదీన వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తెలంగాణ కార్మిక శాఖ.. 
15-11-2023
Nov 15, 2023, 15:57 IST
సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు కాగా.. సగానికి సగం అభ్యర్థులు నామినేషన్లు
15-11-2023
Nov 15, 2023, 12:26 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల్లోని ఆ నేతల చుట్టే...
15-11-2023
Nov 15, 2023, 12:11 IST
నిర్మల్‌: అతివలు రాజకీయ రంగాన్ని శాసిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులూ ఉన్నారు. జనాభాలో, ఓటరు జాబితాలో...
15-11-2023
Nov 15, 2023, 11:19 IST
జగిత్యాల: నామినేషన్ల ఘట్టం ముగిసిపోవడంతో బుధవారం ఎవరెవరు అభ్యర్థులు బరిలో ఉంటారో తెలుస్తుంది. ఈసారి స్వతంత్రులు అధికంగానే ఉన్నారు. ఉమ్మడి...
15-11-2023
Nov 15, 2023, 11:17 IST
కథలాపూర్‌(వేములవాడ): ఎదుటి పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు.. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు...
15-11-2023
Nov 15, 2023, 08:18 IST
మహబూబ్‌నగర్‌: జిల్లాలోని ఓటర్లకు బుధవారం నుంచి ఓటరు సమాచార స్లిప్పులను పంపిణీ చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జి.రవినాయక్‌...
15-11-2023
Nov 15, 2023, 07:41 IST
హైదరాబాద్: వనస్థలిపురానికి చెందిన ఒక వ్యూహకర్త ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపు అవకాశాలపై సర్వే చేపట్టారు. ఇందుకోసం...
15-11-2023
Nov 15, 2023, 07:19 IST
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దాదాపు రెండు వారాలు మాత్రమే గడువుంది. ఈలోగా విస్తృత ప్రచారానికి అధికార బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది....
15-11-2023
Nov 15, 2023, 07:15 IST
హైదరాబాద్: గ్రేటర్‌ పరిధిలోని ఈఆర్‌ఓల నుంచి బూత్‌ లెవల్‌ అధికారుల వరకు ఓటరు జాబితాలను పరిశీలన చేశారా? లేదా? అనే సందేహాలు...
15-11-2023
Nov 15, 2023, 05:50 IST
చిట్యాల: కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే బలమైన నాయకత్వం కలిగిన బీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని ఆ పార్టీ...
15-11-2023
Nov 15, 2023, 05:41 IST
సాక్షి, వరంగల్‌/జనగామ/ సాక్షి, కామారెడ్డి:  తెలంగాణ సాధన పేరిట అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌కు మరోసారి పట్టం గడితే రాష్ట్రంలోని నిరుద్యోగులు అడవి...
15-11-2023
Nov 15, 2023, 05:21 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం మాజీ మంత్రి జానారెడ్డి సహా 11 మంది అభ్యర్థులు రెడీగా ఉన్నారు....
15-11-2023
Nov 15, 2023, 05:14 IST
సాక్షి, హైదరాబాద్‌: ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి రెబెల్స్‌ బెడద తప్పేలా లేదు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు...
15-11-2023
Nov 15, 2023, 05:14 IST
వికారాబాద్‌: ఎట్టి పరిస్థితిల్లోనూ సంకీర్ణ సర్కారు రానివ్వం.. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ మామకు మద్దతిద్దాం.. ఆర్‌ఎస్‌ఎస్‌ అన్న రేవంత్‌రెడ్డిని ఇంట్లో...
15-11-2023
Nov 15, 2023, 04:50 IST
సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అగ్రనేత అమిత్‌ షా రాష్ట్రంలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ...
15-11-2023
Nov 15, 2023, 04:02 IST
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి, మహబూబాబాద్‌/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి ఎలాంటోడని ఆలోచించడమే గాకుండా.....
15-11-2023
Nov 15, 2023, 00:42 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి ఆర్మూర్‌ నియోజకవర్గంలో గోర్త రా...
14-11-2023
Nov 14, 2023, 19:25 IST
రేవంత్‌ రెడ్డి మీద మాత్రమే కాదు.. స్టేషన్‌ ఘన్‌పూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిని ఇందిరపై పలు కేసులు.. 
14-11-2023
Nov 14, 2023, 16:35 IST
కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో అత్యధికంగా 114 నామినేషన్లకు ఆమోదం..  

Read also in:
Back to Top