ప్రతిపక్షంలోనే కూర్చుంటా: చిరాగ్‌ పాశ్వాన్‌ | Chirag Paswan Fires On Nitish Kumar | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షంలోనే కూర్చుంటా: చిరాగ్‌ పాశ్వాన్‌

Oct 18 2020 4:52 PM | Updated on Oct 18 2020 5:46 PM

Chirag Paswan Fires On Nitish Kumar - Sakshi

పట్నా‌ : లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధ్యక్షుడు చిరాగ్‌ పాస్వాన్ బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌పై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ సీఎం సీటే లక్ష్యంగా పనిచేస్తున్న నితీశ్‌.. జేడీయూ నిర్వహించబోయే అన్ని ప్రచార ర్యాలీలకు రావాల్సిందిగా ప్రధాని మోదీపై ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపించారు. అంతేకాకుండా జేడీయూ, బీజేపీ కూటమికి మద్దతు తెలిపేలా తమ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. తన తండ్రి రాం‌ విలాస్‌ పాశ్వాన్‌ ఐసీయూలో ఉండగా కేవలం మద్దతు కోరేందుకే మోదీ తనకు ఫోన్‌ చేశారన్నారు. అందుకే తనకు మోదీ పట్ల గౌరవం తగ్గిపోయినట్టు తెలిపారు. తమ పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరబోదని, ప్రతిపక్షంలోనే కూర్చుంటానని స్పష్టం చేశారు. కాగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ కూడా నితీష్‌‌ కుమార్‌పై మండిపడ్డారు. సీఎం మొదటి, చివరి ప్రేమ సీఎం కుర్చీపైనే ఉంటుందని ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement