ఉచితం పేరుతో ఇసుక దోపిడీ.. ఇదేం పనయ్యా బాబూ..! | Chandrababu Naidu Government Fraud In The Name Of Free Sand, See More Details Inside | Sakshi
Sakshi News home page

ఉచితం పేరుతో ఇసుక దోపిడీ.. ఇదేం పనయ్యా బాబూ..!

Aug 1 2024 4:04 PM | Updated on Aug 1 2024 5:23 PM

Chandrababu Government Fraud In The Name Of Free Sand

ఉచితం పేరుతో చంద్రబాబు సర్కార్‌ ఇసుక దోపిడీకి తెరలేపింది. ఉచితంగా ఇసుక ఇస్తామంటూ డబ్బులు వసూలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.

సాక్షి, విశాఖపట్నం: ఉచితం పేరుతో చంద్రబాబు సర్కార్‌ ఇసుక దోపిడీకి తెరలేపింది. ఉచితంగా ఇసుక ఇస్తామంటూ డబ్బులు వసూలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబు మోసం చేశారంటున్న ప్రజలు.. ఇదేమి ఉచిత ఇసుక విధానమని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో టన్ను ఇసుక ధర పెంచేశారు. భీమిలిలో టన్ను ఇసుక ధర రూ.758 నుంచి రూ.1076 పెరిగింది. ఒకేసారి రూ.318 పెంచడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

తాము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ ఉచితంగా ఇసుక ఇస్తామని కూటమి నేతలు ప్రగల్భాలు పలికారు. అయితే ఉచిత ఇసుక అనేది అబద్ధమని తేలిపోయింది. అధికారంలోకి రాగానే ఉచితం మాట పక్కన పెట్టి దోపిడీకి తెరతీశారు. కూటమి నేతలు ఇసుకను అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దిగిపోయే నాటికి 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక దోచుకున్నారని పలువురు చెబుతున్నారు. కొన్ని చోట్ల ఉచిత ఇసుక అంటూనే రూ.17,000 నుంచి రూ. 18,000 వరకూ వసూలు చేస్తున్నారు. ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement