NITI Aayog Meeting: ‘కేసీఆర్‌ను గద్దె దించే వరకూ వదిలే ప్రసక్తే లేదు’

Central Minister Kishan Reddy Slams CM KCR For not Attending NITI Aayog meeting - Sakshi

ఢిల్లీ: నీతి ఆయోగ్‌పై తీవ్ర విమర్శలు చేసి ఆ సమావేశానికి గైర్హాజరీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి కేసీఆర్‌ రాకపోవడం ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఏవో సాకులు చెప్పి నీతి ఆయోగ్‌పై బురద జల్లడం సమంజసం కాదని కిషన్‌రెడ్డి విమర్శించారు.

‘నీతి ఆయోగ్ మీటింగ్‌కు కేసీఆర్‌ రాకపోవడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. వ్యవస్థల్ని బద్నాం చేయొద్దు. నీతి ఆయోగ్ అవార్డులు వస్తే జబ్బలు చరుచుకున్నరు. తన కొడుకు సీఎం కాలేడనే భయంతో కేంద్రంపై కేసీఆర్‌ దుష్ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్‌ వరుస ఓటములతో ప్రధాని నరేంద్ర మోదీపై విషం కక్కుతున్నరు. దళిత సీఎం ఎక్కడ ? నిరుద్యోగుల భృతి ఎక్కడ ?, ఇళ్ల మంజూరు లో కేంద్రం వెనక్కిపోదు. కేంద్రం తన వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 2015 లో మంజూరు చేసిన ఇల్లు ఇప్పటికీ కట్టలేదు. కేసీఆర్‌ను గద్దె దించే వరకూ వదిలే ప్రసక్తే లేదు. 15 మంత్రిత్వ శాఖలు కేసీఆర్‌ కుటుంబం చేతుల్లో ఉన్నాయి. కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదు’ అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top