ఎప్పటికీ వైఎస్‌ జగన్‌కు విధేయుడినే: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి  

Byreddy Siddharth Reddy Comments On Yellow Media - Sakshi

కర్నూలు(సెంట్రల్‌): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమదని, తాను ఎప్పటికీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విధేయుడినేనని శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. కొన్ని మీడియా సంస్థల్లో తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమైనవని అన్నారు.

చదవండి: పథకాల రద్దుకు ‘పచ్చ’ కుట్ర 

మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడారు. తాను వైఎస్సార్‌సీపీకి వీర సైనికుడినని, తనకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నందికొట్కూరు పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలు, శాప్‌ చైర్మన్‌ పదవిని ఇచ్చారన్నారు. తనకు ఇంత చేసిన పార్టీని తానెందుకు వీడుతానని, మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయడం మానేయాలన్నారు. తాను ఎప్పటికీ వైఎస్సార్‌సీపీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విధేయుడనేనని మరోసారి స్పష్టం చేశారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top