ఉప ఎన్నిక కోసమే ‘గిరిజన బంధు’ 

BSP Chief RS Praveen Kumar Slams On CM KCR Over Girijana Bandhu - Sakshi

చౌటుప్పల్‌ రూరల్‌: మునుగోడు ఉప ఎన్నిక కోసమే సీఎం కేసీఆర్‌ గిరిజన బంధు పథకాన్ని తెస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. గిరిజనులపై అంత ప్రేమ ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసీ బిడ్డ ముర్ముకు ఎందుకు ఓటేయలేదని, అగ్రవర్ణానికి చెందిన యశ్వంత్‌ సిన్హాకు ఎందుకు మద్దతిచ్చారని ఆయన ప్రశ్నించారు.

ప్రవీణ్‌కుమార్‌ చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర గురవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం తుఫ్రాన్‌పేట, మల్కాపురం, ఖైతాపురం, ఎనగంటితండా, పీపల్‌పహాడ్, డి.నాగారం గ్రామాల్లో కొనసాగింది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top