బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యే బాపూరావు గుడ్‌బై | BRS MLA Rathod Bapu Rao set to join the Congress | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యే బాపూరావు గుడ్‌బై

Oct 18 2023 3:23 AM | Updated on Oct 18 2023 3:23 AM

BRS MLA Rathod Bapu Rao set to join the Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్, ఆదిలాబాద్‌: బీఆర్‌ఎస్‌కి బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు గుడ్‌బై చెప్పారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో  భేటీ అయ్యారు. బోథ్‌ టికెట్‌ కోసం దరఖాస్తు సమర్పించారు. బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఈసారి బోథ్‌ నియోజకవర్గం టికెట్‌ను బాపూరావుకు కాకుండా జెడ్పీటీసీ అనిల్‌జాదవ్‌కు టికెట్‌ కట్టబెట్టింది.

ఈ నేపథ్యంలో రేవంత్‌ను కలి సిన బాపూరావు పలు అంశాలపై చర్చలు జరిపా రు. బోథ్‌లో  తనకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇస్తే విజయం సాధిస్తానని స్పష్టం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరుతున్నారని ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూ రావును ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా, త్వరలోనే చేరుతానని తెలిపారు. కాగా, బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి కాంగ్రెస్‌లోకి చేరికల పరంపర కొనసాగు తోంది.

జీహెచ్‌ఎంసీ బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్, మాదాపూర్‌ కార్పొరేటర్‌ జగదీశ్వర్‌ గౌడ్, ఇతర నేతలు రేవంత్‌ నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. అలాగే గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి సమక్షంలో పలు వురు నాయకులు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. కల్వకుర్తి, కొడంగల్‌ నియోజకవ ర్గాలకు చెందిన మాజీ ఎంపీపీలు రాంరెడ్డి, సాంబయ్య గౌడ్, సర్పంచ్‌ లక్ష్మణ్‌ నాయక్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు,  కాంగ్రెస్‌లో చేరారు. షాద్‌ నగర్‌ నియోజకవర్గానికి చెందిన సర్పంచ్‌లు ప్రతాప్, మంజుల, బాల్‌ రాజు, గోపాల్, రాములు, యాదయ్య, జహంగీర్,  కౌన్సిలర్లు, ఇతర నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement