
సాక్షి,హైదరాబాద్:దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలిందని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. శనివారం(ఫిబ్రవరి8) ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రాహుల్‌గాంధీ, రేవంత్‌లు కలిసి ఢిల్లీలో బీజేపీకి విజయం కట్టబెట్టారన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీలను ప్రజలు నమ్మలేదన్నారు. రేవంత్‌రెడ్డి ఇక నుంచి తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేసిన తర్వాతే ఇక నుంచి ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేసుకోవాలని సూచించారు.