అధికారంలో ఉంటే అబద్దాలు నిజమవుతాయా?: కేటీఆర్‌ | BRS KTR Serious Comments On Congress Govt Over Rythu Runa Mafi, Check His Tweet Inside | Sakshi
Sakshi News home page

అధికారంలో ఉంటే అబద్దాలు నిజమవుతాయా?: కేటీఆర్‌

Dec 22 2024 9:33 AM | Updated on Dec 22 2024 11:11 AM

BRS KTR Serious Comments On Congress Govt

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా? అని ప్రశ్నించారు. అలాగే, రుణమాఫీ జరిగితే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన కర్మ రైతన్నలకు ఎందుకు? అని వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..

  • అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా ?

  • రుణమాఫీ కాలేదని రైతన్నలు ఇంకా రోడ్డెక్కుతున్నారు

  • వందశాతం రుణమాఫీ నిరూపిస్తే రాజీనామాకు సిద్దమని శాసనసభ సాక్షిగా సవాల్ విసిరితే స్వీకరించకుండా తోక ముడిచిన ప్రభుత్వం.

  • రుణమాఫీ కానీ రైతన్నలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?

  • రుణమాఫీ జరిగితే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన కర్మ రైతన్నలకు ఎందుకు?

  • రా పోదాం పోరాటాల గడ్డ ఇంద్రవెల్లి

  • రా పోదాం అడవుల తల్లి ఆదిలాబాద్

  • ధనోరా రోడ్డు మీద కూసున్న రైతుల ముందే మీ మాయల మాఫీ లెక్కలు తేల్చుదాం

  • రుణమాఫీ మాయ

  • రైతుభరోసా రూ. 7500 మాయ

  • తులం బంగారం మాయ

  • మహిళలకు రూ.2500 మాయ

  • రూ.4000 ఆసరా ఫించన్లు మాయ

  • రూ.6000 దివ్యాంగుల ఫించన్లు మాయ

  • జాగో తెలంగాణ జాగో అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement