బీఆర్‌ఎస్‌ బంద్‌.. గజ్వేల్‌లో ఉద్రిక్తత.. | BRS Gajwel Bandh Program Live Updates | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ బంద్‌.. గజ్వేల్‌లో ఉద్రిక్తత..

Apr 6 2026 10:27 AM | Updated on Apr 6 2026 11:05 AM

BRS Gajwel Bandh Program Live Updates

గజ్వేల్‌ బంద్‌ అప్‌డేట్స్‌..

గజ్వేల్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీసీసీ అధ్యక్షులు ఆంక్షా రెడ్డి ఇంటి ముట్టడికి బీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నించారు. దీంతో, పోలీసులు.. వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ స్వల్ప వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్‌ఎస్‌ నేతలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

కాగా, గజ్వేల్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్‌ఎస్‌ నేడు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో దుకాణాలు మూతపడ్డాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బైఠాయించి ఆందోళన చేపట్టిన బీఆర్‌ఎస్‌ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. గజ్వేల్‌లోని కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఇక, రెండ్రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. అదే సమయంలో క్యాంప్ ఆఫీస్ కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. కాంగ్రెస్ నేతలే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేశారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. తాము సీఎం ఫోటో పెట్టడానికే వెళ్ళాం.. దాడి చేయలేదని కాంగ్రెస్ నాయకుల వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదుతో డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షా రెడ్డి సహా 42 మందిపై గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement