బీజేపీ దోపిడీ ముఠాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి

BJP Should Be Abolished From Telangana PCC Chief Revanth Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చేనేత మీద 12 శాతం జీఎస్టీ వేసి చేనేత కళను చంపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. చేనేత కార్మికుల జీవితాలతో బీజేపీ చెలగాటమాడు తోందని విమర్శిస్తూ ఆదివారం తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. నేతన్నకు అన్యాయం చేస్తున్న బీజేపీ దోపిడీ ముఠాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలని ఆ ట్వీట్‌లో రేవంత్‌ పిలుపునిచ్చారు.

కాగా, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని నేతన్నలకు రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించి స్వాతంత్య్ర సముపార్జనకు ఒక సాధనంగా నిలిచిన చేనేత రంగానికి ప్రత్యేకమైన రోజు ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. గాంధీ కూడా రాట్నంపై నూలు వడకడానికి ప్రాధాన్యం ఇచ్చారని, కాంగ్రెస్‌ పార్టీలో నేత కార్మికులకు ప్రత్యేక స్థానం ఉంటుందని ఆ ప్రకటనలో రేవంత్‌ వెల్లడించారు.
చదవండి: అయోధ్యలో బీజేపీ నేతల భూ కుంభకోణం.. అఖిలేశ్‌ యాదవ్‌ ఫైర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top