హుజూరాబాద్‌లో ఈటల గెలుపు ఖాయం  | BJP OBC Morcha National President Laxman Comments On Etela Rajender | Sakshi
Sakshi News home page

హుజూరాబాద్‌లో ఈటల గెలుపు ఖాయం 

Oct 19 2021 2:59 AM | Updated on Oct 19 2021 2:59 AM

BJP OBC Morcha National President Laxman Comments On Etela Rajender - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపు ఖాయమైందని, మెజారిటీ ఎంత వస్తుందన్న దే ఇప్పుడు తేలాల్సి ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌.లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ జాతీయ పదాధికారుల సమావేశంలో ఆయనతోపాటు డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

అనంతరం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పెనుమార్పులు ఖాయమని జోస్యం చెప్పారు. ఓబీసీల సంక్షే మం కోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ఈ నెల 22న ఢిల్లీలో ఓబీసీ మేధావుల సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు లక్ష్మణ్‌ వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement