అమిత్‌ షా టార్గెట్‌ పశ్చిమ బెంగాల్‌ 

BJP Mission Bengal : Amit Shah Focus on West Bengal - Sakshi

కోల్‌కతా :  బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరకముందే బీజేపీ తన తదుపరి లక్ష్యాన్ని ఎంచుకుంది. వచ్చే ఏడాది 2020 పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధమవుతోంది. అందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తన అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గురు, శుక్రవారాల్లో పశ్చిమ బెంగాల్‌లో ఆయన పర్యటించనున్నారు. భాజాపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రెండు రోజులు బెంగాల్‌లో పర్యటించాల్సింది. కానీ ఆయన పర్యటన అనుకోకుండా వాయిదా పడింది. 

బీజేపీ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ సిన్హా జాతీయ కార్యదర్శి పదవిని కోల్పోయారు. అదేసమయంలో తృణముల్‌ నుంచి బీజేపీలో చేరిన ముఖుల్‌ రాయ్‌, అనుపమ్‌ హజ్రకు పదవులు దక్కాయి. మమతా బెనర్జీ తర్వాత తృణముల్‌ కాంగ్రెస్‌లో ముఖుల్‌ రాయ్‌ది రెండో స్థానం. మమతా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ముఖుల్ రాయ్‌ తృణముల్‌ పార్టీ ఉపాధ్యాక్షుడుగా కూడా  ఎన్నికయ్యారు.

కొన్నిరోజులుగా బెంగాల్‌లోని బీజేపీ నాయకుల మధ్యం సక్యత లేదు. వారి మధ్య వివాదాలను సమసిపోయేలా చూడడం కూడా అమిత్‌ షా పర్యటన ఉద్ధేశం. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన బన్‌కుర, కోల్‌కతాలో కార్యకర్తలతో సమావేశమయ్యే అవకాశముందని తెలస్తుంది. 

ఈ పర్యటనలో భాగంగా అమిత్‌ షా గవర్నర్‌ జగదీప్‌ దంకర్‌ను కలిసేందుకు వస్తున్నాడని విశ్వసనీయ సమాచారం. ఇటీవలే సీఎం మమతా బెనర్జీకి గవర్నర్‌కు మధ్య ట్విటర్‌ వేదికగా మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్‌ జరగనున్న ఎన్నికలు మమతకు సవాలుగా నిలవనున్నాయి.  గతేడాది పార్లమెంటుకు జరిగన సాధారణ ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని పార్టీ దారుణ పరాజయాన్ని చూసింది. అదంతా చూస్తుంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికారంలోకి రాని బీజేపీకి గెలుపు కష్టమేమి కాకపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్టోబరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం దుర్గాపూజలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా బెంగాలీలో కొన్ని మాటలు మాట్లాడి వారికి దగ్గరవ్వడానికి ప్రయత్నించారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top