వచ్చే ఎన్నికల్లో పోటీపై విజయశాంతి క్లారిటీ.. అసెంబ్లీకా? పార్లమెంట్‌కా?

BJP Leader Vijayashanti With Sakshi On 25 Years Of Political Career

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణను ఎలాగైనా సాధించి, రాష్ట్ర ప్రజల్లో ఆ ఆనందాన్ని చూడాలన్న ప్రధాన ఆశయంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చిన్నట్లు చెప్పారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. తెలంగాణ వచ్చినా కూడా కేసీఆర్‌ దొర వద్ద ప్రజలు బానిసలుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇంత మంది త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబానికే లాభం జరిగిందని మండిపడ్డారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి 25 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు.

తెలంగాణ ఏర్పాటుతో కేసీఆర్‌ కుటుంబానికే లాభం జరిగిందని విజయశాంతి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కమిషన్లు తీసుకున్న కేసీఆర్‌ కుటుంబానికి, వారి బినామీలకే లబ్ది చేకూరిందన్నారు. ప్రాజెక్టుతో ప్రజలకు నీరు మాత్రం రావడం లేదని, రైతులు నష్టపోతున్నారన్నారని అన్నారు. ఒక పనికిమాలిన ప్రాజెక్టు కట్టారని దుయ్యబట్టారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్‌ సర్కార్‌ 5 లక్షల కోట్ల అప్పులుగా మార్చిందని మండిపడ్డారు.. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలడిగితే చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్‌కు లేదా? ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఎందుకు అని నిలదీశారు

‘బీఆర్‌ఎస్‌ దేనికోసం పెట్టావ్‌. ఎవరికోసం పెట్టావ్‌.. తెలంగాణ డబ్బుల్ని బీఆర్‌ఎస్‌ పేరుతో ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్‌ఎస్‌.. కేసీఆర్‌లో కమిట్‌మెంట్‌ లేదు. కేసీఆర్‌పై పోరాడానికి తెలంగాణ బీజేపీ సిద్ధంగా ఉంది. కానీ మమ్మల్ని ఇబ్బందిలు పెడుతున్నారు. సభలకు, పాదయాత్రలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు

తొలుత మెదక్‌ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేశాను. చేయాల్సిన అభివృద్ధి చేశాను. ఇప్పుడు నేను కొత్తగా పోటీ చేయాలి. ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కేంద్ర డిసైడ్‌ చేస్తుంది. అసెంబ్లీ, పార్లమెంట్‌లో దేనికి పోటీ చేసేది త్వరలో తెలుస్తుంది. ఏ పార్టీలో చిన్న చిన్న గొడలు ఉంటాయి. వాటిని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ఒక టీం వర్క్‌లాగే ముందుకు వెళ్తున్నాం. బీజేపీ చాలా డిసిప్లెన్‌ పార్టీ’ అని విజయశాంతి వ్యాఖ్యానించారు. ఆమె ఇంకేం మాట్లాడారో తెలుసుకునేందుకు ఈ కింది వీడియో చూడండి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top