రానున్నది బీజేపీ సర్కారే : మాజీ ఎంపీ విజయశాంతి | Bjp Leader Vijayashanthi Fires On CM Kcr | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ పతనం ప్రారంభమైంది

Dec 11 2020 8:26 AM | Updated on Dec 11 2020 8:36 AM

Bjp Leader Vijayashanthi Fires On CM Kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పతనం ప్రారంభమైందని, ఇక అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన ఆమె మొదటిసారిగా గురువారం రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చా రు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో కలసి ఆమె మీడియా తో మాట్లాడారు. తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన విద్యార్థుల శవాల పై కూర్చొని కేసీఆర్‌ పరిపాలిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టే ఆయనను ఇన్ని రోజులుగా భరిస్తున్నారని, ఇకపై భరించే స్థితిలో లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ను తరిమికొడతారని జోస్యం చెప్పారు. మరోవైపు కాంగ్రెస్‌లో పదవుల పంచాయతీ ఇంకా నడుస్తోందన్నారు. కేసీఆర్‌ పెద్ద క్రిమినల్‌ అని, తనకంటే పెద్ద నటుడన్నారు.

తాను గతంలో ఎంపీ అయ్యాక, టీఆర్‌ఎస్‌ పార్టీలో ఎదుగుతున్నాననే భయంతో కాంగ్రెస్‌కు వెళ్లిపోతున్నట్లు కేసీఆరే ప్రచారం చేయించారన్నారు. ఓయూకు వెళితే తన మనుషులతో అనరాని మాటలు అనిపించారని, తనను చెప్పలేని మాటలతో తిట్టించారని మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పి సోనియా గాంధీని మోసం చేశారన్నారు. కేసీఆర్‌కంటే ముందే 1998 నుంచి తాను తెలంగాణ అంశంపై పోరాడానని తెలిపారు. గతంలో బీజేపీలో ఉండి తెలంగాణ కోసం పోరాడానని, తప్పని పరిస్థితిలో బీజేపీని వీడానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ సాధనకు తల్లి తెలంగాణ పార్టీ పెట్టానని, ఆ తరువాత కేసీఆర్‌ వచ్చారన్నారు. తాను దూకుడుగా పోతుంటే దురుద్దేశంతో కేసీఆర్‌ తమ పార్టీలోకి రావాల్సిందిగా ఒత్తిడి చేశారని, తెలంగాణ కోసం చివరికి ఒప్పుకున్నానని తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement