BJP Leader Madhav Sensational Comments On Alliance With Janasena Party - Sakshi
Sakshi News home page

పవన్‌ మాతో కలిసి రావడం లేదు: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Mar 21 2023 5:35 PM | Updated on Mar 21 2023 8:17 PM

BJP Leader Madhav Sensational Comments On Alliance With Janasena - Sakshi

అమరావతి: అవసరం అయితే బీజేపీకి బైబై చెప్పేందుకు కూడా సిద్ధమేనంటూ ఇప్పటికే తన వైఖరి ఏమిటో చెప్పకనే చెప్పేశాడు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఇది మరింత స్పష్టమైందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

బీజేపీకి పవన్‌ కల్యాణ్‌ దూరం జరగాడా అనే దానిపై ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. దీనికి బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ఊతన్నిచ్చాయి. తమతో పవన్‌ కల్యాణ్‌ కలిసి రావడం లేదని మాధవ్‌ సంచలన ఆరోపణలు చేశారు. జనసేనతో పొత్తు ఉన్నా.. లేనట్లే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తమకు ఎమ్మెల్సీ ఎన్నికలలో సహకరించాలని కోరినా పవన్‌ స్పందించలేదని ఆయన స్పష్టం చేశారు. పైగా కమ్యూనిస్టులు తమకు సపోర్ట్‌ చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారని, దాన్ని ఖండించాలని కోరినా పవన్‌ కల్యాణ్‌ ఖండించలేదన్నారు మాధవ్‌.


Advertisement
 
Advertisement
Advertisement