తెలంగాణలో బీజేపీ పొత్తులు.. గుజ్జుల కీలక వ్యాఖ్యలు | Bjp Leader Gujjula Comments On Party Alliance In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో బీజేపీ పొత్తులు.. గుజ్జుల కీలక వ్యాఖ్యలు

Feb 17 2024 8:05 PM | Updated on Feb 17 2024 8:31 PM

Bjp Leader Gujjula Comments On Party Alliance In Telangana - Sakshi

సాక్షి,ఢిల్లీ: రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించిందని బీజేపీ తెలంగాణ  ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జనసేనతోనూ ఈసారి పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. 

‘అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు.  ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోము. కొంతమంది జోకర్లు మాట్లాడే మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటింగ్‌ శాతం రెట్టింపయింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోబోతున్నాం’ అని ప్రేమేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి.. కాంగ్రెస్‌లో చేరిక.. ఈటల క్లారిటీ 

Advertisement
 
Advertisement
Advertisement