TS: కాంగ్రెస్‌లో చేరిక.. ఈటల క్లారిటీ | Etala Rajender Clarified On Joinining In Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో చేరిక.. బీజేపీ నేతల ఈటల క్లారిటీ

Feb 17 2024 3:43 PM | Updated on Feb 17 2024 6:03 PM

Etala Rajender Clarified On Joinining In Congress  - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో చేరనున్నారన్న వార్తలపై బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌ నేతలు పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో తాను ప్రత్యేకంగా భేటీ కాలేదని తెలిపారు.   

మన్సూరాబాద్ కార్పొరేటర్ నర్సింహరెడ్డి గృహ ప్రవేశ కార్యక్రమంలో వారిద్దరితో  కలిసి భోజనం చేస్తున్న ఫోటోలను కొందరు ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చారు. మైనంపల్లి, పట్నంను రాజకీయాల కోసం కలవలేదన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఉన్నానని,పార్టీ మారుతున్నట్లు తనపై జరుగుతున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. 

ఇదీ చదవండి.. కాంగ్రెస్‌లో చేరిన వెంటనే ఆ జెడ్పీచైర్‌పర్సన్‌పై బీఆర్‌ఎస్‌ 

Advertisement
 
Advertisement
Advertisement