కాంగ్రెస్‌పై దేశద్రోహం పెట్టాలి: బండి సంజయ్‌ ఫైర్‌ | Sakshi
Sakshi News home page

అవార్డులను అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది: బండి సంజయ్‌

Published Sat, Feb 3 2024 1:57 PM

BJP Bandi Sanjay Serious Comments On Congress Party - Sakshi

సాక్షి, కరీంనగర్: బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై ఎంపీ బండి సంజయ్‌ హర్షం వ్యక్తం చేశారు. అద్వానీకి భారతరత్న ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీపై దేశద్రోహం పెట్టాలని డిమాండ్‌ చేశారు. 

కాగా, బండి సంజయ్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దేశంలో ఎమర్జెన్సీ, అయోధ్య పోరాటంలో పాల్గొన్న అద్వానీకి భారతరత్న ఇవ్వడం సంతోషంగా ఉంది. అన్ని సర్వేల్లో బీజేపీ, ప్రధాని మోదీనే మళ్లీ గెలుస్తారు అని రిపోర్టులు రావడం చూసి బీఆర్‌ఎస్‌ నాయకులు కంగారు పడుతున్నారు. బీఆర్‌ఎస్‌ ఎంపీ ఎన్నికల కోసం చేసిన సర్వే రిపోర్టు నా దగ్గరకి వచ్చింది. 

కాంగ్రెస్‌పై దేశద్రోహం కేసు పెట్టాలి. దేశాన్ని విభజించాలి అంటూ కాంగ్రెస్‌ ఎంపీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. టెర్రరిస్టులు, ఉగ్రవాదులు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేతలు సపోర్టు చేస్తున్నారు. ఇండియా కూటమి విచ్చినం అవుతుందన్న ఆందోళనతో వారు ఇలాంటి పిచ్చి కామెంట్స్‌ చేస్తున్నారు. రాజీవ్‌ గాంధీ కూడా ఇలా మాట్లాడిన చరిత్ర ఉంది. అవార్డులను అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది. కాంగ్రెస్‌ హయాంలో పద్మభూషణ్‌, పద్మశ్రీ అవార్డులు కావాలంటే డబ్బులు ఇస్తే వచ్చేవి. కానీ, సమాజంలో నిజమైన అర్హులకు మాత్రమే బీజేపీ అవార్డులను ఇస్తోంది’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement