బీజేపీకి దగ్గరగా ఆర్ఎల్ఎస్పీ!

Bihar Election: Politics is a game of possibilities, says Madhav Anand - Sakshi

సాక్షి, పట్నా: బిహార్ రాజకీయాల్లో గతేడాది లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి వేరైన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ తిరిగి బీజేపీ వైపు చూస్తోందా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో దీనికి సంబంధించి సమాలోచనలు చేయనున్నట్లు ఆర్ఎల్ఎస్పీ జాతీయ కార్యదర్శి మాధవ్ ఆనంద్ తెలిపారు. రాష్ట్ర జాతీయ స్థాయి నేతలతో ఓ భేటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతమున్న మహాకూటమిలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని ఆరోపించారు. తిరిగి ఎన్డీయేతో కలవనున్నారా అన్న ప్రశ్నకు, రాజకీయాల్లో అన్నీ సాధ్యమే అని బదులిచ్చారు. ఇప్పటికే ఎన్డీయే నాయకులతో చర్చలు పూర్తయినట్లు సమాచారం. (ఎన్డీఏ అంటే నో డాటా అవైలబుల్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top